FACEBOOK JIO DEAL HERE IS WHAT MARK ZUCKERBERG HAS TO SAY BS
Reliance Jio-Facebook deal : జియో-ఫేస్బుక్ బంధంపై స్పందించిన మార్క్ జూకర్బర్గ్ ..
ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్
దేశీయ టెలికం రంగంలో అగ్రగామిగా ఉన్న జియోతో ఫేస్బుక్ జత కట్టింది. జియోలో 9.99 శాతం వాటాను ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఈ బంధంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ స్పందించారు.
దేశీయ టెలికం రంగంలో అగ్రగామిగా ఉన్న జియోతో ఫేస్బుక్ జత కట్టింది. జియోలో 9.99 శాతం వాటాను ఫేస్బుక్ సొంతం చేసుకుంది. రూ.43,574 కోట్ల విలువను స్టాక్స్‌ను దక్కించుకుంది. దీంతో రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలుతో కంపెనీలో అతి పెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్బుక్ నిలవనుంది. అయితే, ఈ బంధంపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ స్పందించారు. భారత్‌లో జియోతో ఫేస్బుక్ జత కట్టిందని, ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయని వెల్లడించారు. కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఫేస్బుక్ పోస్టులో ‘తమ బంధంతో దేశంలోని ప్రజలకు ఆర్థిక అవకాశాలు మెరుగవుతాయి. డిజిటల్ ఎకనామీ అభివృద్ధికి తమ బంధం దోహదం చేస్తుంది. ఇప్పటికే ఫేస్బుక్, వాట్సాప్‌లో భారతీయుల పాత్ర చాలా పెద్దది. భారత్ డిజిటల్ దిశగా వేగంగా ప్రయాణం సాగిస్తోంది. చిన్న వ్యాపారాలు ఆన్లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పులో జియో పాత్ర అత్యంత కీలకం’ అని జూకర్బర్గ్ తెలిపారు.
భారత్‌లో 6 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయని, మిలియన్ల మంది వాటిపై ఆధారాపడి బతుకుతున్నారని ఫేస్బుక్ సీఈవో తెలిపారు. ‘లాక్డౌన్ లాంటి సమయాల్లో చాలా మంది డిజిటల్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. వీలైనంతగా కస్టమర్లకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఆ దిశగా తమ వంతు సహాయం అందించేందుకు ఫేస్బుక్, జియో జతకట్టాయి. ఫేస్‌బుక్‌తో జత కట్టినందుకు ముఖేశ్ అంబానీకి కృతజ్ఞతలు. జియో టీమ్‌కు కూడా’ అని జూకర్బర్గ్ పోస్ట్ చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.