మొరాయించిన ఫేస్‌బుక్, వాట్సాప్.. కారణం ఇదేనా ?

బుధవారం రాత్రి నుంచి సక్రమంగా ఓపెన్‌ అవకుండా యూజర్లను ఇబ్బంది పెడుతోంది. కొత్త పోస్టులు పెట్టడం, షేర్‌ చేయడం సాధ్యపడకపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు.

news18-telugu
Updated: March 14, 2019, 3:11 PM IST
మొరాయించిన ఫేస్‌బుక్, వాట్సాప్.. కారణం ఇదేనా ?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 14, 2019, 3:11 PM IST
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్ మొరాయించింది. దాంతోపాటు ఇన్‌స్టాగ్రామ్ వాట్సాప్ యూజర్లు కూడా ఇబ్బంది పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు బుధవారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ఇబ్బందులు పడ్డారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో కొత్త పోస్టులు పెట్టడం, మెసేజ్‌లు పంపడం సాధ్యపడలేదు. బుధవారం రాత్రి నుంచి సక్రమంగా ఓపెన్‌ అవకుండా యూజర్లను ఇబ్బంది పెడుతోంది. కొత్త పోస్టులు పెట్టడం, షేర్‌ చేయడం సాధ్యపడకపోవడంతో యూజర్లు డీలా పడ్డారు. మొబైల్ యాప్ కొంతవరకు పనిచేస్తున్నా.. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో లాగిన్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. డైరెక్ట్ మెసేజీలు, కంటెంట్ పోస్ట్ చేసే బటన్ కనిపించక యూజర్లు కాసేపు తికమకపడ్డారు. 'సారీ, సమ్‌థింగ్ వెంట్ రాంగ్' అనే మెసేజ్‌ యూజర్లకు కనిపించింది. ఫేస్‌బుక్‌ గ్రూప్‌ యాప్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లలోనూ ఇదే తరహా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

అయితే ఫేస్‌బుక్ ఇలా మొరాయించడానికి కారణం సైబర్ ఎటాక్ అని కొందరు ఆరోపించారు. డిస్ట్రిబ్యూటడ్ డెనియల్ ఎటాక్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్‌) అటాక్‌ జరగిందని అనేకమంది భావించారు. అందుకే ఇలా సమస్యలు తలెత్తాయని అనుకున్నారు. అయితే ఫేస్‌బుక్‌ మాత్రం వీటిని ఖండిస్తూ పోస్ట్‌ పెట్టింది. మేం ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది. మరోవైపు ఫేస్‌బుక్‌ పనిచేయకపోవడంతో యూజర్లు #FacebookDown, #InstagramDown అనే హ్యాష్‌ ట్యాగ్‌లు క్రియేట్‌ చేసి ట్విట్టర్‌లో జోకులు పేల్చారు. అయితే ఈ ఇష్యూను సాధ్యమైనంత త్వరగా ఫిక్స్ చేస్తామని ఫేస్‌ బుక్ తెలిపింది.

 
First published: March 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...