FACEBOOK BUYS 9 99 PERCENT STAKE IN RELIANCE JIO FOR RS 43574 CRORE BS
Reliance Jio-Facebook deal : రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటా కొన్న ఫేస్బుక్..
ప్రతీకాత్మక చిత్రం
Reliance Jio-Facebook deal : రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ.43,574 కోట్లకు ఈ వాటాను దక్కించుకుంది.
రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ.43,574 కోట్లకు ఈ వాటాను దక్కించుకుంది. రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలు వల్ల జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఫేస్బుక్ నిలవనుంది. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. ఇండియా డిజిటల్ సర్వోదయ లక్ష్యంతో 2016లో జియోను ప్రారంభించాం. దేశంలోని ప్రతీ ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకొచ్చాం. ఇప్పుడు జియోలోకి ఫేస్‌బుక్‌ను ఆహ్వానిస్తున్నాం. ఇది గౌరవప్రదమైనది. తద్వారా ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. జియో, ఫేస్బుక్ సమాహారం డిజిటల్ ఇండియాకు ఉపయోగపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఎలాంటి హద్దులు లేకుండా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. కరోనా తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్బుక్ బంధం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ ఒక పోస్టులో ‘భారత్‌లో జియోతో ఫేస్బుక్ జత కట్టింది. ప్రజలు, వ్యాపారం కోసం జియో, ఫేస్బుక్ కలిసి సరికొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కీలక ప్రాజెక్టుల్లో ఈ సంస్థలు కలిసి పనిచేయనున్నాయి’ అని తెలిపారు. డిజిటల్ ఎకనామీ అభివృద్ధికి తమ బంధం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారత్ డిజిటల్ దిశగా వేగంగా ప్రయాణం సాగిస్తోంది. చిన్న వ్యాపారాలు ఆన్లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పులో జియో పాత్ర అత్యంత కీలకం. అదీకాక.. భారత్‌లో 6 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. లక్షలాది మంది వాటిపై ఆధారాపడి బతుకుతున్నారు. లాక్డౌన్ లాంటి సమయాల్లో చాలా మంది డిజిటల్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. వారికి జియో సహాయం చేస్తోంది. ఫేస్‌బుక్‌తో జత కట్టినందుకు ముఖేశ్ అంబానీకి కృతజ్ఞతలు. జియో టీమ్‌కు కూడా’ అని జూకర్బర్గ్ పోస్ట్ చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.