ట్రెండింగ్

  • Associate Partner
  • diwali-2020
  • diwali-2020
  • diwali-2020

Diwali 2020: సోషల్ మీడియాకు దీపావళి కళ.. కొత్త అవతార్లతో హల్ చల్

సాధారణ రోజుల్లోనే హడావిడి చేసే సోషల్ మీడియా.. ఏదైనా పండుగలు వస్తే ఊరుకుంటుందా..? అందులోనూ దీపావళి వంటి పండుగ అయితే ఇక రచ్చరచ్చే. యువతను ఆకర్షించడానికి పలు సామాజిక మాధ్యమాల సంస్థలు కొత్త కొత్త అవతార్లను తీసుకొస్తున్నాయి.

news18
Updated: November 12, 2020, 1:41 PM IST
Diwali 2020: సోషల్ మీడియాకు దీపావళి కళ.. కొత్త అవతార్లతో హల్ చల్
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 12, 2020, 1:41 PM IST
  • Share this:
సామాజిక మాధ్యమాలు దీపావళి కళను సంతరించుకుంటున్నాయి. తమ వినియోగదారులు పండుగ వేడుకలను సరికొత్తగా నిర్వహించుకునేందుకు ఆయా సంస్థలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్బుక్ కూడా చేరింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్.. దీపావళికి కోసమే ప్రత్యేకంగా కొన్ని అవతార్లను సిద్ధం చేసింది. దీంతో పాటు కోవిడ్ నేపథ్యంలో ఇంట్లోనే దీపావళి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన 'DiwaliAtHomeChallenge'వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ గా మారుతున్నాయి.

దీపావళి కోసం ఇంతకు ముందే ట్విట్టర్ కొత్త ఎమోజీని ప్రవేశపెట్టింది. దానికి ఒక రోజు తర్వాత ఫేస్బుక్లో కొత్త అప్డేట్ ను ప్రకటించింది. ఫేస్బుక్ యాజమాన్యానికి చెందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కూడా దీపావళి నేపథ్యంలో కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫిల్టర్ ను జోడించింది. దీంతో ఈ వేదికలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి.

ప్రొఫైల్ ను అలంకరించుకోవచ్చు
దీపావళి అవతార్లు, థీమ్ ఎఫెక్ట్స్ ను ఫేస్బుక్ వినియోగదారులు యాక్సెస్ చేసుకోవచ్చు. యూజర్లు వ్యక్తిగత గ్రీటింగ్‌లను కూడా తమ ప్రొఫైల్ కు యాడ్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ఆండ్రాయిడ్, iOSలో ఫేస్బుక్ యాప్ ను వాడే కస్టమర్లు, యాప్ ద్వారా ఫేస్బుక్ అవతార్ ను సృష్టించాలి. అనంతరం ‘క్రియేట్ పోస్ట్’ ఆప్షన్ ను ఎంచుకొని బ్యాక్ గ్రౌండ్ కలర్ ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ కనిపించే దివాళీ బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.


హ్యాష్ ట్యాగ్ లు కూడా...
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంట్లోనే దీపావళి వేడుకలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి హ్యాష్ ట్యాగ్ దీపావళి ఎట్ హోమ్ ఛాలెంజ్ (#DiwaliAtHomeChallenge)ను ఫేస్బుక్ ప్రారంభించింది. దీనిని ఉపయోగించి వినియోగదారులు పండుగను ఇంటి దగ్గర ఎలా జరుపుకుంటున్నారో తెలియజేసే ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. రీ సైకిల్ బల్బులు, క్యాండిల్ హోల్డర్ ప్రమిదలు.. వంటి వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేశారో తెలిపే DIY వీడియోలను కూడా వినియోగదారులు పంచుకోవచ్చు. ఫేస్బుక్లో #DIYDiwaliChallenge హ్యాష్‌ట్యాగ్ ద్వారా స్నేహితులకు సవాలు విసరవచ్చు. కొత్త పోస్టు ద్వారా స్నేహితులకు ఇలాంటి ఛాలెంజ్ చేయడానికి హ్యాష్‌ట్యాగ్ గుర్తును, ఛాలెంజ్ అనే పదాన్ని టైప్ చేస్తే చాలు. అందుబాటులో ఉన్న హ్యాష్‌ట్యాగ్ లు కనిపిస్తాయి.

ట్విట్టర్ కొత్త ఎమోజీ
ట్విట్టర్ ఇండియా కూడా దీపావళి కోసం ప్రత్యేకంగా ఎమోజీని విడుదల చేసింది. ఇది అరచేతిలో వెలుగుతూ ఉన్న ప్రమిదను పోలి ఉంది. ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థ వినియోగదారుల జీవితాల్లో సానుకూల మార్పు రావాలనే ఉద్దేశంతో #LightUpALife హ్యాష్‌ట్యాగ్‌ను విడుదల చేసింది. ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ కూడా ప్రమిదలు, పండుగ రంగులు ప్రతిబింబించేలా కొత్త AR ఎఫెక్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు #ShareYourLight హ్యాష్‌ట్యాగ్ తో పండుగకు సంబంధించిన ఫోటోలను పంచుకోవచ్చు.
Published by: Srinivas Munigala
First published: November 12, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading