అత్యంత అరుదైన బ్లూ లాబ్‌స్టర్... దాన్ని ఆ రెస్టారెంట్‌ ఏం చేసిందో తెలుసా...

Blue Lobster : అరుదైన జీవుల్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఆ విషయంలో ఆ రెస్టారెంట్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 1:32 PM IST
అత్యంత అరుదైన బ్లూ లాబ్‌స్టర్... దాన్ని ఆ రెస్టారెంట్‌ ఏం చేసిందో తెలుసా...
అరుదైన లాబ్‌స్టర్ (Image : FB / Arnold's Lobster & Clam Bar)
Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 1:32 PM IST
మసాచుసెట్స్‌‌లోని ఓ సముద్ర ఆహార రెస్టారెంట్‌కి ఎప్పట్లాగే చాలా లాబ్‌స్టర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం బ్లూ కలర్‌లో ఉంది. దాన్ని చూసి రెస్టారెంట్ నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. అందరూ దాని చుట్టూ గుమి కూడి... ఇది ఈ రంగులో ఎలా వచ్చింది అని ఆలోచించారు. దాన్ని ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కస్టమర్లు రావడం, లాబ్‌స్టర్ల ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం అన్నీ కామన్‌గా జరిగిపోయాయి. ఐతే... ఆ లాబ్‌స్టర్‌ని చూసిన ఓ కస్టమర్... అది ఆ రంగులోకి ఎలా వచ్చిందన్నదానిపై ఆక్వా పరిశోధకుల్ని అడిగాడు. వాళ్లు ఏం చెప్పారంటే... జన్యు లోపాల వల్ల ఇలాంటి లాబ్‌స్టర్లు పుడతాయనీ, 20 లక్షల్లో ఒక్కటి మాత్రమే ఇలా ఉంటుందని చెప్పారు. ఆశ్చర్యపోయాడు. అదే విషయం చెబుతూ... ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.


ఆన్‌లైన్‌లో వైరలైన ఈ పోస్ట్‌కి టన్నులకొద్దీ కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ లాబ్‌స్టర్‌ను వండేయకుండా... సందర్శకులు చూసేందుకు ప్రత్యేక ఆక్వేరియంలో ఉంచారు. ఇలా కొన్ని రోజులు ఉంచాక... దాన్ని ఎవరికైనా సముద్ర జీవుల ప్రేమికులకు డొనేట్ చేస్తామని చెబుతున్నా్రు.

 ఇవి కూడా చదవండి :

వావ్... తెలివైన మేక... కేటీఆర్ ఆ ట్వీట్ లైక్ చేశారుగా...

మియామీ బీచ్‌లో మహిళ అరెస్ట్... తాబేలు గూడు పాడు చేసిందని...
Loading...
వాళ్లిద్దరూ లవర్స్... ఆతనిపై యాసిడ్ పోసి... తనపైనా పోసుకుంది... ఎందుకంటే...

కానిస్టేబుల్ కామ పురాణం... అర్థరాత్రి యువతిని బ్లాక్‌మెయిల్ చేసి...

 
First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...