హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Black Tiger: వైరల్ గా మారిన నల్ల పులి ఫొటోలు.. మీరు కూడా చూడండి..

Black Tiger: వైరల్ గా మారిన నల్ల పులి ఫొటోలు.. మీరు కూడా చూడండి..

నల్లపులి ఫొటోలు

నల్లపులి ఫొటోలు

నల్లగా ఉండే పులులు మీరెప్పుడన్నా చూశారా..? అదేంటి.. పులులు నల్లగా ఉండడం ఏంటి.. అని అనుకుంటున్నారా? అవునండి అలాంటి పులులు కూడా ఉంటాయి. కాకపోతే ఇలాంటి పులులు ప్రపంచం మొత్తంలోనే కేవలం ఓ ఆరేడు మాత్రమే ఉన్నాయి.

నల్లగా ఉండే పులులు మీరెప్పుడన్నా చూశారా..? అదేంటి.. పులులు నల్లగా ఉండడం ఏంటి.. అని అనుకుంటున్నారా? అవునండి అలాంటి పులులు కూడా ఉంటాయి. కాకపోతే ఇలాంటి పులులు ప్రపంచం మొత్తంలోనే కేవలం ఓ ఆరేడు మాత్రమే ఉంటాయి. అయితే ఆ ఆరేడు అరుదైన పులులు కూడా మన దేశంలోనే ఉండడం విశేషం. అవును.. ఒడిషా రాష్ట్రంలోని సిమ్లిపాల్ రిజర్వ్ లో ఇలాంటి పులులు ఉన్నాయి. సౌమెన్ బాజ్‌పేయీ అనే ఫొటో గ్రాఫర్ ఈ పులి ఫొటోలను తాజాగా తన కెమెరాలో బంధించాడు. వన్యప్రాణులను ఫొటో తీయడానికి అడవిలోకి వెళ్లినప్పుడు తనకు ఈ అదృష్టం దక్కిందని అతను సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ముప్పై సెకండ్ల పాటే ఆ పులి కనిపించిందని వేగంగా స్పందించి వెంటనే ఫొటోలు తీసినట్లు చెప్పాడు.


అయితే.. అతను ఈ అరుదైన పులి ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచడంతో వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆ ఫొటోలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నిజంగా నల్లపులా లేకా ఏదైనా నలుపు రంగు వేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు ఇలాంటి పులి ఉంటుంది అని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. జన్యులోపం కారణంగా కొన్ని పులులు ఈ రంగులో జన్మిస్తాయి. ఇలాంటి పులిని మెలనిస్టిక్ టైగర్ అని పిలుస్తారు. ఈ పులి చర్మంపై మందపాటి నల్లటి చారలు ఉంటాయి.

First published:

Tags: Odisha news, Tiger

ఉత్తమ కథలు