వామ్మో.. జనావాసాల్లోకి భారీ అరుదైన మొసలి.. వీడియో వైరల్..

మొసలి వీడియోపై సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ జాన్ బ్రూగ్గెన్ స్పందిస్తూ "చాలా మంది ప్రజలు మొసలి నడకను ఎప్పుడూ చూసి ఉండరు. కాబట్టి, వారు ఈ వీడియోను నకిలీగా భావిస్తున్నారు. కానీ, ఇటువంటి మొసళ్లు కనిపించడం సాధారణమే అని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: November 16, 2020, 6:08 PM IST
వామ్మో.. జనావాసాల్లోకి భారీ అరుదైన మొసలి.. వీడియో వైరల్..
భారీ మొసలి
  • Share this:
మొసలిని చూసి భయపడని వారంటూ ఎవరు ఉండరు. మొసలి దాడులు, ఇతర దృశ్యాలను టీవీలు, ఫోన్లో చూస్తుంటేనే భయమేస్తుంది. అలాంటిది ఒక మొసలి ఎదురుగా వస్తే? ఇక అంతే సంగతి మరి. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ మధ్య కాలంలో మొసళ్ల సంచారం అధికమైంది. చుట్టుపక్కల నదులు, సరస్సులలో నుంచి గోల్ఫ్ కోర్సుల్లోకి తరచుగా మొసళ్లు వస్తున్నాయి. తాజాగా ఫ్లోరిడాలోని నేపుల్స్లో ఉన్న వాలెన్సియా గోల్ఫ్ & కంట్రీ క్లబ్‌లో అరుదైన మొసలి కనిపించింది. దీంతో అక్కడే ఉన్న పిజిఎ ప్రొఫెషనల్ జెఫ్ జోన్స్ ఆ దృశ్యాన్ని తన ఫోన్ కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

వైరల్ అయిన ఈ చిత్రాలను నేపుల్స్ డైలీ న్యూస్ కూడా ప్రచురించింది. అయితే, జెఫ్ జోన్స్ తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కాకముందే, వింక్ న్యూస్ వాతావరణ శాస్త్రవేత్త మాట్ డెవిట్ ఆ మొసలికి సంబంధిన ఫోటోలను ట్వీట్ చేసాడు. అయితే, బఫ్ మృగంలా భారీ ఆకారంలో కనిపించిన ఈ మొసలి దృశ్యాలు నకిలీవని చాలా మంది భావించారు. మాట్ డెవిట్ విడుదల చేసిన ఈ ఫోటోలు, వీడియోలు అనుమానాస్పదంగా ఉన్నాయని ట్విట్టర్లో ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వీడియోలో కనిపించిన మొసలి కాళ్ళు చాలా పొడవుగా కనిపించడమే చాలా మంది నెటిజన్లు దీన్ని ఫేక్ వీడియోగా భావించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

మొసలి వీడియోపై సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ జాన్ బ్రూగ్గెన్ స్పందిస్తూ "చాలా మంది ప్రజలు మొసలి నడకను ఎప్పుడూ చూసి ఉండరు. కాబట్టి, వారు ఈ వీడియోను నకిలీగా భావిస్తున్నారు. కానీ, ఇటువంటి మొసళ్లు కనిపించడం సాధారణమే, ఇదేమీ పెద్ద వింతగా భావించాల్సిన అవసరం లేదు" అని అన్నారు. సాధారణంగా వయోజనంలో ఉన్న మొసళ్లు, తొమ్మిది నుండి 10 అడుగుల ఎత్తు ఉంటాయి. అంతేకాక, వాటి కాళ్ల పొడవు ఒకటి నుంచి రెండు అడుగుల వరకు ఉంటుంది.’’ అని ఆయన పేర్కొన్నారు.


అయితే, ఈ ఫోటోలను చూసేటప్పుడు కొంతమంది వక్రీకృత భావనకు లోనయ్యే అవకాశం ఉంది కనుక ఈ మొసలి నిజంగా ఉన్న పరిమాణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఇటువంటి మొసళ్లను మనం బయట ఎప్పుడూ చూసి ఉండం. అందువల్ల దీన్ని ఫేక్ వీడియోగా చాలా మంది నెటిజన్లు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో సాధారణమైనదే. దీంట్లో ఎటువంటి కల్పితం లేదు." అని ఆయన అన్నారు. ఫ్లోరిడాలోని నేపుల్స్లో ఉన్న వాలెన్సియా గోల్స్ అండ్ కంట్రీ క్లబ్లో కనిపించిన ఈ మొసలి షికారు చేయడానికి వచ్చినట్లుగా భావించవచ్చు.” అని ఆయన అభిప్రాయపడ్డారు. గోల్ఫ్ కంట్రీ క్లబ్లో వీడియో మొసలి వీడియో తీసిన మరో పిజిఎ ప్రొఫెషనల్ టైలర్ స్టోల్టింగ్ మయామి మాట్లాడుతూ ‘‘మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ మొసలిని చూశానని, ఆ వెంటనే నా కెమెరాలో బంధించాను.’’ అని చెప్పాడు. అయితే, కొద్ది సేపటి తర్వాత తాను తిరిగి వచ్చే సరికి మొసలి అదృశ్యమైందని ఆయన తెలిపాడు.
Published by: Shiva Kumar Addula
First published: November 16, 2020, 6:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading