హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG:‘కటింగ్ చేస్తుండగా అధికారులు లాక్కెళ్లారు..’ మాజీ మంత్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

OMG:‘కటింగ్ చేస్తుండగా అధికారులు లాక్కెళ్లారు..’ మాజీ మంత్రి ఆవేదన.. అసలేం జరిగిందంటే..

మాజీ మంత్రి భరత్ భూష్ (ఫైల్)

మాజీ మంత్రి భరత్ భూష్ (ఫైల్)

Punjab: విజిలెన్స్ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. కొన్నిరోజులుగా మాజీ మంత్రిపై నిఘాపెట్టారు. ఆయన పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

కొన్నిరోజులుగా విజిలెన్స్, ఈడీ అధికారులు తమ స్పీడును పెంచారు. ఇప్పటికే అనేక చోట్ల అవినీతికి పాల్పడుతున్న వారిపై సీక్రెట్ గా నిఘాపెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు మంత్రులను అరెస్టు చేస్తున్నారు. దీంతో ఇది తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. కాగా, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శలు చేస్తున్నాయి. కేంద్రం కావాలనే ఈడీ, విజిలెన్స్ (Vigilance officers) అధికారులను, తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై, తమ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి విజిలెన్స్ అధికారులు మరో మాజీ మంత్రిని అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ (Punjab) మాజీ మంత్రి భరత్ భూష్ అషుపై (Bharat Bhushan Ashu) అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన.. ఆహారం, పౌర సరఫరాల మంత్రిగా సమయంలో.. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లపై (రవాణా స్కామ్) టెండర్లు కేటాయించారని పలు ఆరోపణలు వచ్చాయి. ఇంతకుముందు అధికారిక ప్రకటన ప్రకారం, "వాహనాల నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లపై రవాణా టెండర్లను కేటాయించిన కుంభకోణంలో శుక్రవారం ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మాజీ మంత్రి భరత్ భూషణ్ ఆశుపై కేసు నమోదైంది". దీనిపై విచారణ జరుగుతోందని, ఆహార, పౌరసరఫరాల శాఖకు చెందిన మరికొందరు అధికారులు స్కానర్‌లో ఉన్నారు.

మొహాలీలోని విజిలెన్స్ బ్యూరో కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శన చేసిన కొన్ని గంటల తర్వాత మంత్రిని అరెస్టు చేశారు. లూథియానాలోని ఓక సెలూన్ నుంచి ఆయనను అరెస్టు చేశారు. కనీసం గడ్డం, కటింగ్ కూడా చేసుకొనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, భరత్ భూష్.. పంజాబ్ కాంగ్రెస్ నాయకులు విజిలెన్స్ బ్యూరో విచారణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే ఆయనను విజిలెన్స్ అధికారులు అరెస్టు చేయడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి బ్యూరోను ఉపయోగిస్తోందని మాజీ మంత్రి భరత్ (Ex Punjab Minister)  భూష్ ఆరోపించారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Politics, Punjab, VIRAL NEWS

ఉత్తమ కథలు