హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Imran Khan: అమ్మదొంగ.. మరో వివాదంలో పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్.. 18 కోట్ల విలువైన నెక్లెస్ మాయం..

Imran Khan: అమ్మదొంగ.. మరో వివాదంలో పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్.. 18 కోట్ల విలువైన నెక్లెస్ మాయం..

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

Ex Pak PM Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పీఎంగా ఉన్నప్పుడు ఖజానాలోని కోట్ల విలువ చేసే బంగారం మాయమైందని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

Imran Khan Probed For Alleged Sale Of Gifted Necklace: ఇమ్రాన్ ఖాన్ ను వివాదాలు ఇప్పట్లో  వదలిపెట్టేలా  లేవు. తాజాగా, ఆయన మరోసారి వార్తలలో నిలిచారు. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాలోని బంగారు నెక్లెస్ మాయమైందని అధికారులు గుర్తించారు. దాని విలువ దాదాపు రూ. 18 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారు నెక్లెస్ ను ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రైవేటు వ్యాపారికి విక్రయించారని.. ఆయనపై స్థానిక వార్త సంస్థలలో పలు ఆరోపణలు వచ్చాయి.

ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు గిఫ్ట్ గా లభించిన.. తోషా-ఖానా (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపలేదని అధికారులు గుర్తించారు. దీన్ని ఆయన అసిస్టెంట్ జుల్పికర్ బుఖారీ లాహోర్ లోని నగల వ్యాపారికి 18 కోట్లకు విక్రయించారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, దీన్ని పాక్ అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ  సీరియస్ గా తీసుకుంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA), ఇమ్రాన్ పై విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ సంఘటన పాక్ లో కలకలంగా మారింది.

నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి తర్వాత జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానంలో ఓడిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనను గద్దె దించడం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని తొలి నుంచీ ఆరోపిస్తోన్న ఆయన ఇప్పుడు దేశంలో మరో స్వాతంత్ర్యపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ఇందులో ప్రజలంతా పాల్గొనాలలని పిలుపునిచ్చారు. ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఖాన్ తన తొలి ప్రకటనలోనే కొత్త సర్కారుకు చుక్కలు చూపించబోతున్నట్లు హెచ్చరికలు పంపారు..

పాకిస్తాన్ లో అధికార పీటీఐ పార్టీకి మిత్రులు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ఖాన్ సర్కారు మెజారిటీ కోల్పోవడం, అసెంబ్లీ-సుప్రీంకోర్టు మధ్య కొన్నాళ్ల దోబూచులాట తర్వాత, ఆదివారం అర్థరాత్రి తర్వాత ఖాన్ ప్ర‌భుత్వం కుప్ప‌కూలడం తెలిసిందే. పదవి కోల్పోయిన త‌ర్వాత పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాక్‌లో మ‌రో మారు స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి వ‌క్కానించారు. ఇవాళ్టి నుంచే ఉద్య‌మం మొదలైందని ప్రకటించిన ఆయన.. విదేశీ కుట్ర‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌ళ్లీ పోరాటం చేయాల‌ని ప్రజలకు పిలుపునిచ్చారు.

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు