రిహన్నా స్వీటా, హాటా... వైరల్ ట్వీట్స్‌తో సెన్సేషన్...

సింగర్ రిహన్నా వేసుకునే కాస్ట్యూమ్స్ ఆధారంగా... చేసిన ఆ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

news18-telugu
Updated: May 13, 2020, 2:53 PM IST
రిహన్నా స్వీటా, హాటా... వైరల్ ట్వీట్స్‌తో సెన్సేషన్...
రిహన్నా స్వీటా, హాటా... వైరల్ ట్వీట్స్‌తో సెన్సేషన్... (credit - twitter - deepraj)
  • Share this:
కొంతమంది ఖాళీగా ఉండకుండా... తమ బుర్రకు పదును పెడుతుంటారు. సోషల్ మీడియాలో ఏదో ఒక కొంటె పని చేస్తుంటారు. ఒక్కోసారి అలాంటి వాళ్లు చేసిన పనులు... వైరల్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంటాయి. తాజాగా... ఓ ట్విట్టరాటి... పాప్ సింగర్ రిహన్నాను ఇండియన్ స్నాక్స్‌తో పోల్చడం వైరల్ అయ్యింది. రిహన్నాను అతను బేసిన్ లడ్డూ, మోమో, సమోసా, ఫలూదా ఇలా చాలా రకాలుగా పోల్చాడు. ఆమె వేర్వేరు సందర్భాల్లో వేసుకున్న డ్రెస్సుల ఆధారంగా... ఆ డ్రెస్సుల్లో ఆమె ఎలా కనిపిస్తోందంటే... అంటూ... రకరకాల స్వీట్లు, వంటలతో ఆమెను పోల్చాడు. ఇప్పుడీ ట్వీట్లు వైరల్ అయ్యాయి.


చిత్రమేంటంటే... రిహన్నాను మొత్తం 25 ఇండియన్ ఫుడ్ ఐటెమ్స్‌తో పోల్చడం. ఎంత బాగా పోల్చాడంటే... ఆ ఐటెంని చూసే... ఈ కాస్ట్యూమ్ తయారుచేశారా అని నెటిజన్లకు డౌట్ వచ్చేంతలా. ఈ డ్రెస్‌లో రిహన్నా ఎలా ఉందో మీరు ఆలోచించాల్సిన పనిలేదు... ఇలా ఉంది అంటూ... పెట్టిన ట్వీట్లు అందర్నీ వావ్ అనిపిస్తున్నాయి.
చికెన్ తందూరీ, కాజూ కట్లీ ఇలా ఏది చూసినా... ఆ ఐటెం లాంటి డ్రెస్సుల్లోనే ఉంది రిహన్నా. ఓ ట్వీట్‌లో ఆమెను మసాలా చాయ్‌తో పోల్చాడు. రెడ్ పార్టీ డ్రెస్ వేసుకుంటే... రూ అఫ్జాతో పోల్చాడు. వైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే... కోకోనట్ బర్ఫీలా ఉందని తేల్చాడు.

కుల్ఫీ, గులాబ్ జామ్, బర్గర్, దాల్... ఇలా ప్రతీదీ పోల్చేందుకు వీలుగా అయిపోయింది. గోల్ గప్ప, ఫచ్కాలా కూడా ఆమె కనిపించడం విశేషం.

Published by: Krishna Kumar N
First published: May 13, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading