దగ్గులు, తుమ్ములూ మనకే కాదు.. ఇతర ప్రాణులకూ వస్తాయి. జనరల్‌గా పక్షులూ, జంతువులూ ఆవలించే దృశ్యాలూ, వీడియోలూ మనం చూస్తుంటాం. కానీ కోడి తుమ్మడం ఎప్పుడూ చూసి ఉండం. కోళ్లకు సాధారణంగా తుమ్మాల్సిన పరిస్థితి రాదు. అందువల్లే అవి తుమ్మడం మనం ఎప్పుడూ చూడం. కానీ ఓ కోడి కుయ్ మంటూ తుమ్మిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నెటిజన్లకు బాగా నచ్చుతోంది.
ఈ వీడియోని రెడ్డిట్ లోని Different_Leather234 యూజర్.. నవంబర్ 26, 2022న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ దీనికి 8.2 అప్ ఓట్లు వచ్చాయి. ఈ వీడియోని గమనిస్తే.. ఓ ఇంటి గుమ్మ దగ్గర నిలబడిన కోడి.. సడెన్‌గా కుయ్ మని తుమ్మింది. తన తుమ్ము తనకే ఆశ్చర్యం కలిగించినట్లు షాక్ లోకి వెళ్లిందా కోడి.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
ఈ వీడియోపై నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. "అది మామూలు తుమ్ము కాదు" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా.. "కోళ్లను పెంచే వాడిగా చెబుతున్నాను. నేనెప్పుడూ ఇలాంటిది వినలేదు. వినాలి అనుకోవట్లేదు" అని మరో యూజర్ స్పందించారు.
చిన్నారి ప్రాణంతీసిన చాక్లెట్.. తల్లిదండ్రులూ మీ పిల్లలు జాగ్రత్త
"అది తుమ్ములా లేదు.. చీదినట్లుగా, దగ్గినట్లుగా ఉంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "ఆ కోడి.. గద్ద అరిచినట్లుగా తుమ్మింది" అని మరో యూజర్ కామెంట్ రాశారు. "ఆ కోడి ఎందుకు అలా తుమ్మింది? దానికి బర్డ్ ఫ్లూ వచ్చిందా?" అని మరో యూజర్ కామెంట్ రాశారు. ఇలా ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, Viral, Viral Video