ఊరి జనాన్ని హడలెత్తించి భయంతో పారిపోయిన సింహం... వైరల్ వీడియో...

Gujarat : అందరూ ఒకలా ఆలోచిస్తే... ఆ సింహం మరోలా అనుకుంది. బాబోయ్ అంటూ పరుగెడుతూ పారిపోయింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: March 10, 2020, 9:54 AM IST
ఊరి జనాన్ని హడలెత్తించి భయంతో పారిపోయిన సింహం... వైరల్ వీడియో...
ఊరి జనాన్ని హడలెత్తించి భయంతో పారిపోయిన సింహం... వైరల్ వీడియో... (credit - twitter - Susanta Nanda IFS)
  • Share this:
Gujarat : అది గుజరాత్‌లోని మాధవ్‌పూర్ గ్రామం. అక్కడకు మీరు వెళ్తే... ఊరు అడవిలో ఉందా... లేక... ఊరులో అడవి ఉందా అనిపిస్తుంది. అలాంటి కన్‌ఫ్యూజన్ ఏరియాలో... ఓ సింహం... అడవి అనుకొని ఊర్లోకి వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది. ఊర్లోకి వచ్చిన సింహాన్ని చూశారు. అమ్మో సింహం... బాబోయ్ సింహం అంటూ ఒకటే అరుపులు, కేకలు. అసలే కన్‌ఫ్యూజ్‌లో ఉన్న సింహాన్ని వాళ్లంతా రౌండప్ చేసేసరికి దానికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్లేమో... "అది మనలో ఎవరిపైనైనా దాడి చెయ్యడానికి రావచ్చు. మనం సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోవాలి. కత్తులు తియ్యండి, కర్రలు చేత పట్టండి" అని ఒకరి కొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఆ సింహమేమో... "అరే మీరంతా చుట్టూ మూగితే... నేనెలా పోవాలి... తప్పుకోండ్రా నాయనా" అన్నట్లు చూస్తోంది. ఇలా కాసేపు కోలాహలం అయిన తర్వాత... "ఇక మీరు తప్పుకోరు గానీ... నేనే పోతా" అనుకుంటూ... ఆ సింహం భయంతో పరుగులు పెడుతూ పారిపోయింది. అది తమ మీదకు వస్తుందేమో అన్న భయంతో జనం కూడా తలో దిక్కుకూ పారిపోయారు. చివరకు ఆ సింహం అడవిలోకి పారిపోయింది. ఈ కొన్ని సెకండ్ల వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనలాంటి వాళ్లంతా దాన్ని చూసి... సూపర్ అన్నారు. వైరల్ అయ్యింది. వద్దంటే వ్యూస్ వస్తూనే ఉన్నాయి.


ఈ సందర్భంగా చిన్న విషయం. సింహం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పరిగెత్త గలదు. ఉస్సేన్ బోల్ట్ లాంటి ప్రపంచ మేటి రన్నర్లు సైతం సింహం నుంచీ తప్పించుకోలేరు. ఈ ఘటనలో అటు స్థానికులు, ఇటు సింహం... రెండువైపులా... ఎవరిపైనా ఎవరూ దాడి చేసుకోలేదు. అందువల్ల ఎవరికీ ఏమీ కాలేదు. హ్యాపీ ఎండింగ్ అవ్వడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాకపోతే... సింహం అలా కుక్కలా భయపడి పారిపోతుండటాన్ని చూసి నవ్వుతున్నారు.
First published: March 10, 2020, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading