Home /News /trending /

EVEN ANIMALS WONT EAT THIS UTTAR PRADESH COP BREAKS DOWN OVER MESS FOOD VIDEO GOES VIRAL PAH

‘కుక్కలు కూడా ఈ ఫుడ్ ను ముట్టుకోవు.. ’.. కన్నీళ్లు పెట్టుకున్న పోలీసు.. వీడియో వైరల్..

కానిస్టేబుల్ మనోజ్ కుమార్

కానిస్టేబుల్ మనోజ్ కుమార్

Uttar pradesh: కానిస్టేబుల్ తమకు ఇస్తున్న ఫుడ్ పట్ల కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫుడ్ ను కుక్కలు కూడా ముట్టుకోవని బాధపడ్డాడు. అంతే కాకుండా..

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India
కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో,  హస్టల్ లలో ఫుడ్ కోసం ప్రైవేటుగా కాంట్రాక్ట్ ఇస్తుంటారు. అయితే.. వారు తీసుకున్న డబ్బులకు, బిల్లులకు సరిపోయేంత క్వాలిటీ మెంటైన్ చేయరు. తక్కువ క్వాలిటీ బియ్యం, పప్పులతో ఫుడ్ ను ప్రిపేర్ చేస్తారు. దీంతో విద్యార్థులకు సరైన పోషకాహారం లభించదు. దీంతో వారు.. అనేక రోగాల బారినపడుతుంటారు. అయితే.. పోలీసు ఉద్యోగాలలో కూడా డ్యూటీలు వేస్తుంటారు. కొన్నిసార్లు.. వీరికి సరైన ఫుడ్ ఇవ్వడంలో కాంట్రాక్టర్ లు విఫలమవుతుంటారు. పోలీసులు సమయపాలనతో సంబంధం లేకుండా.. అధికారులు ఎప్పుడు ఎక్కడ డ్యూటీలు వేస్తే అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ తమకు ఇస్తున్న ఫుడ్ పట్ల కన్నీళ్లుపెట్టుకుని నిరసన తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా (Viral video) మారింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) బాధకర సంఘటన జరిగింది. ఫిరోజాబాద్ జిల్లాలో ఒక కానిస్టేబుల్ తన బాధను అందరిముందు వెల్లడించాడు. తమకు అధికారులు.. కేటాయిస్తున్న ఫుడ్ లో సరైన నాణ్యత పాటించడం లేదని అన్నాడు. మనోజ్ కుమార్ అనే స్థానిక కానిస్టేబుల్ తన బాధను అందరిముందు చెప్పుకున్నాడు. పోలీసుల మెస్ లో వడ్డించే భోజనం నాణ్యత పై రోడ్డుపై నిలబడి బోరున విలపించాడు. నోరులేని జీవాలు కూడా ఇలాంటి భోజనం తినవని ఆయన అన్నారు.



అక్కడ ఉన్న సహా ఉద్యోగులు, సీనియర్ అధికారులు అతడికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఫుడ్ క్వాలిటీ గురించి పై అధికారులకు చెబితే పట్టించుకోవడం లేదిన మనోజ్ కుమార్ బాధపడ్డాడు. అంతే కాకుండా తనను సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ కావడంతో ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు ఆదేశించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Police, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు