హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Eternal Love Lock: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి సమాధి.. ప్రేమతో కౌగిలించుకునే భంగిమలో అస్థిపంజరాలు.. అసలు మ్యాటర్ ఇదే..

Eternal Love Lock: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి సమాధి.. ప్రేమతో కౌగిలించుకునే భంగిమలో అస్థిపంజరాలు.. అసలు మ్యాటర్ ఇదే..

Eternal Love Lock

Eternal Love Lock

Eternal Love Lock: అక్కడ వారు 600 వరకు సమాధులు ఉన్న శ్మశానాన్ని గుర్తించారు. వాటిలో చిరకాల ప్రేమకు చిహ్నంగా కనిపిస్తున్న ఈ జంట అస్థిపంజరాలు బయటపడ్డాయి. క్రీ.శ 386-534 మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన నార్తర్న్ వీ రాజవంశంలో ఈ జంటను ఖననం చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సదరు స్త్రీ ఎడమ చేతి ఉంగరం వేలుకు బంగారంతో చేసిన ఉంగరం ఉంది. తన భర్తను ప్రేమతో కౌగిలించుకునే భంగిమలోనే అస్థిపంజరాలు ఉన్నాయి

ఇంకా చదవండి ...

ప్రేమించిన వ్యక్తి చనిపోతే.. వారు లేకుండా బతకలేమని కొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటారు. దీన్ని ఆత్మహత్య(గా కాకుండా, ప్రేమకోసం చేసిన త్యాగంలా భావిస్తారు. పురాతన కాలం నుంచి ఇలా త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి జంటకు సంబంధించిన అస్థిపంజర అవశేషాలు తాజాగా చైనా (China)లో బయటపడ్డాయి. ఒక వ్యక్తి చనిపోగా, తన భార్య కూడా అతడితో పాటు ఖననం చేసుకున్నట్లు భావిస్తున్న సమాధి ఒకటి పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది. అస్థిపంజరాల అవశేషాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, వీరిని 1500 సంవత్సరాల క్రితం ఖననం చేసినట్లు తేల్చారు. సమాధిలోనూ ఒకరిని ఒకరు ప్రేమతో హత్తుకున్నట్లు (Eternal Love Lock)గా కనిపిస్తున్న ఈ జంట.. చిరకాల ప్రేమ (Eternal Love)కు ఉదాహరణగా కనిపిస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక నిర్మాణ ప్రాజెక్టు కోసం షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటాంగ్ నగరం (Datong city)లో అధికారులు తవ్వకాలు జరిపారు. అక్కడ వారు 600 వరకు సమాధులు ఉన్న శ్మశానాన్ని గుర్తించారు. వాటిలో చిరకాల ప్రేమకు చిహ్నంగా కనిపిస్తున్న ఈ జంట అస్థిపంజరాలు బయటపడ్డాయి. క్రీ.శ 386-534 మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన నార్తర్న్ వీ రాజవంశంలో ఈ జంటను ఖననం చేసినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సదరు స్త్రీ ఎడమ చేతి ఉంగరం వేలుకు బంగారంతో చేసిన ఉంగరం ఉంది. తన భర్తను ప్రేమతో కౌగిలించుకునే భంగిమలోనే అస్థిపంజరాలు ఉన్నాయి. వారి ప్రేమకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వారిని ఇలా సమాధి చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

అస్థిపంజరాల విశ్లేషణ బట్టి.. దంపతుల్లో భర్త మరణించే నాటికి అతడి వయసు 29- 35 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తేలింది. అతడు 5.4 అంగుళాల ఎత్తు ఉన్నట్లు గుర్తించారు. అతడి కుడి చేయి విరిగిపోయినట్లు కనిపిస్తోంది. కుడి చేతి ఉంగరం వేలు కూడా లేదు. మహిళ ఎముకల విశ్లేషణ ఆధారంగా, సమాది చేసే నాటికి ఆమె చాలా ఆరోగ్యంగా ఉందని, ఆమె ఎడమ చేతి వేలికి ఉంగరం ఉందని గుర్తించారు. 5.2 అడుగుల ఎత్తు ఉన్న ఆ మహిళ వయసు 35-40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి :   IPL 2021 సెకండాఫ్‌కి నయా జోష్..! బరిలోకి దిగనున్న కొత్త ఆటగాళ్లు వీళ్లే..! ఫస్ట్ టైం సింగపూర్ ప్లేయర్ కి చోటు.

అయితే ఇద్దరినీ ఒకే సమాధిలో ఎలా ఖననం చేశారనే వివరాలపై స్పష్టత లేదు. చనిపోయిన భర్తతో పాటు తాను కూడా సమాధి అయిందని పరిశోధకులు ప్రాథమికంగా గుర్తించారు. కానీ ఇందుకు ఇతర పరిస్థితులను సైతం తోసిపుచ్చలేమని వారు వెల్లడించారు. వీ-జిన్, దక్షిణ, ఉత్తర రాజవంశాల కాలంలో.. జంటల ఉమ్మడి ఖననాలు ఎక్కువగా జరిగేవని చరిత్ర చెబుతోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: China, International news, Telugu news, VIRAL NEWS

ఉత్తమ కథలు