Home /News /trending /

ERITREA OF AFRICA CONTINENT WHERE MEN HAVE TO GET TWO MARRIAGES IF ANY ONE OBJECT THEY WILL GET LIFE IMPRISONMENT SK

Two Marriages: అక్కడ ప్రతి అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే జైల్లో వేస్తారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Two Marriages: ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా దేశంలో వింత వివాహ సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా..! అక్కడ ప్రతి పురుషుడూ రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. ఒకవేళ రెండో పెళ్లి నిరాకరిస్తే వారిని జైల్లో వేస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    వివాహం (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. చనిపోయే వరకు గుర్తుంచుకునే మధురమైన జ్ఞాపకం. ఆ రోజు నుంచే లైఫ్‌లో కొత్త ప్రయాణం మొదవుతుంది. అందుకే వివాహ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఐతే వివాహం సంప్రదాయాలు రాష్ట్రాన్ని, సామాజిక వర్గాన్ని బట్టి మారుతుంటాయి. అంతేకాదు వివాహ చట్టాలు కూడా వేర్వేరు దేశాల్లో వేర్వేరుగా ఉంటాయి. పాతకాలంలో బహు భార్యత్వ విధానం ఉండేది. ఒక పురుషుడు ఎంతమందినైనా భార్యలుగా చేసేకునే పద్దతిని పాటించేవారు. కానీ కాల క్రమణేలా ఆ సంప్రదాయం కనుమరుగైపోయింది. ఇప్పుడు చాలా చోట్ల ఏక పత్రీవ్రతాన్నే అనురిస్తున్నారు. ఒకవేళ రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. మొదటి భార్యకు తప్పనిసరి విడాకులు ఇవ్వాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే సంప్రదాయం ఉంది.

    Guests to pay for food : పెళ్లికి పిలిచి..అతిధులు తిన్న ఫుడ్ కి డబ్బులు కట్టాలన్న వధువు!

    ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా (Eritrea Polygamy)  దేశంలో వింత వివాహ సంప్రదాయం ఉంది. ఇది సంప్రదాయం మాత్రమే కాదు.. చట్టం కూడా..! అక్కడ ప్రతి పురుషుడూ రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. ఒకవేళ రెండో పెళ్లి నిరాకరిస్తే వారిని జైల్లో వేస్తారు. ఏకంగా జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. స్త్రీలు కూడా దీన్ని అంగీకరించాలి. మరో మహిళతో కలిసి భర్తను పంచుకోవాలి. కాదని అడ్డు చెబితే.. వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా.. భర్తతో సంతోషంగా లేకున్నా.. అందరూ ఈ నిబంధనను పాటించాలి. పురుషులు కూడా.. తనకు ఇష్టం లేకపోయినా... పోషించే శక్తిపోయినా.. ఖచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే. ఇద్దరు భార్యాలను చూసుకోవాల్సిందే..! అందుకే సంప్రదాయాలకు విలువనిస్తూ.. చట్టాలను గౌరవిస్తూ.. అక్కడి మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

    OMG: నడిరోడ్డు మీద సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం.. షాకింగ్ వీడియో వైరల్..

    పురుషులు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలన్న నిబంధన వెనక ఓ బలమైన కారణముంది. మనదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. అంటే మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా ఉంటారు. కానీ ఎరిత్రియాలో అలా కాదు.. పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంటుంది. అందుకే స్త్రీ, పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి.. పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం.. ఎవరైనా ఒకే భార్యను కలిగి ఉంటే.. అతడిని దోషిగా పరిగణిస్తారు. ఈ చట్టంతో ఎరిత్రియాపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కానీ తమ దేశంలో ఉన్న స్త్రీ, పురుష నిష్పత్తిని నియంత్రించేందుకే రెండు పెళ్ళిళ్ల విధానాన్ని ఎరిత్రియా అమలు చేస్తోంది. పెళ్లి, ఓటు హక్కు, డ్రైవింగ్‌కు కనీసం వయసు దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఆయా దేశాల్లో పరిస్థితులకు అనుగణంగా వీటిని నిర్ణయిస్తారు. ఎరిత్రియా కూడా పెళ్లి విషయంలో రెండు వివాహాల విధానాన్ని అమలు చేస్తోంది.



    మరోవైపు ఎరిత్రియాలో రెండు పెళ్లిళ్లు తప్పనిసరిగా చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేదనే వాదనలు కూడా ఉన్నాయి. రెండు పెళ్లిళ్లు చేసుకోవడం నేరం మాత్రం కాదని అంటున్నారు. అంటే ఒక పురుషుడు ఒక పెళ్లైనా చేసుకోవచ్చు, రెండైనా చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రజల ఇష్టాయిష్టాలకే వదిలేసిందని కూడా చాలా మంది చెబుతున్నారు. పైకి ఇలా చెప్పినప్పటికీ.. రెండు పెళ్లిళ్ల నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Africa, International, International news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు