హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేసిన పెంపుడు శునకం.. ఆతర్వాత..

నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేసిన పెంపుడు శునకం.. ఆతర్వాత..

ఆస్పత్రిపాలైన మహిళ

ఆస్పత్రిపాలైన మహిళ

Viral news: మహిళ గాఢమైన నిద్రలో ఉంది. ఇంతలో ఆమె ముఖంమీద, నోట్లో ఏదో ద్రవం పడటంతో ఆమెకు ఒక్కసారిగా మెళకువ వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

మనలో చాలా మంది శునకాలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లోని ఒక మనిషిలాగే ట్రీట్ చేస్తారు. ప్రత్యేకమైన ఫుడ్ పెడతారు. వాకింగ్ కు తీసుకెళ్తుంటారు. అయితే.. కొన్నిసార్లు శునకాలు ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అవి చేసే పనులు సరదాగా ఉంటాయి. వాటి యజమాని ఒక్క నిముషం కన్పించకపోయిన అవి ఆహారం ముట్టుకోవు. అయితే.. కొన్నిసార్లు పెంపుడు కుక్కలు ఇతరులపై దాడులు చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇంట్లోవారికే ఇబ్బందికల్గేలా ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఇంగ్లండ్ లో (England) వింత ఘటన జరిగింది. బ్రిస్టల్ కు చెందిన అమండా గొమ్మో (51) అనే మహిళ నిద్రపోతున్నప్పుడు ఆమె పెంపుడు ముఖంమీద ఏదో ద్రవం పడినట్లు అనిపించింది. దీంతో ఆమె ఉలిక్కిపడి లేచింది. అయితే.. కొంత ద్రవం ఆమె నోటిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో.. మహిళకు మెళకువ వచ్చింది. ఆమె పెంపుడు శునకం.. ఆమె ముఖంమీద మూత్ర విసర్జన చేసింది. శునకం కొన్ని రోజులుగా తీవ్ర మైన జీర్ణకోశ ఇన్ఫెక్షన్‌ ఏర్పడింది. ఈ క్రమంలో అది తన యజమాని ముఖంమీద మలమూత్రవిసర్జన చేసింది. దీంతో మహిళకు వాంతులు అయ్యాయి.

ఆ తర్వాత.. ఆమెలో కొన్ని మార్పులు కన్పించాయి. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమెను టెస్ట్ చేసిన వైద్యులు శునకం వలన ఏదో చెడు బ్యాక్టిరియా ఆమె కడుపులో వెళ్లిందని నిర్దారించారు. దీంతో మహిళను ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. కాగా, ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డాక్టర్ లో డిశ్చార్జ్ చేశారు. తన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని, తన పెంపుడు శునకం అంటే కోపంలేదని మహిళ అమండా గొమ్మో తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Viral news)  మారింది.

ఇదిలా ఉండగా ఒక సన్యాసి పదేళ్లుగా కుడి చేతిని పైకే ఎత్తిపెడుతున్నాడు.

రిపోర్టర్ ఒక అజ్ఞాత స్వామిజీకి దగ్గరకు వెళ్లాడు . ఆయన ఎంత సేపు మాట్లాడిన చేతిని మాత్రం అసలు కిందకు దించడం లేదు. దాదాపు.. పదేళ్లుగా ఇలానే చేతి పైకెత్తి పెట్టుకుంటున్నట్లు తెలిపాడు. శివుని అనుగ్రహం కోసం ఈ విధంగా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే.. కుడిచేతికి ఎలాంటి స్పర్శలేదని కూడా తెలిపాడు. మొదట్లో కష్టంగా ఉండేదని కానీ ఇప్పుడు అలవాటైపోయిందని చెప్పాడు. తన జీవితాంతం చేయి పైకి ఎత్తి పెడతానని సన్యాసి చెప్పాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral news)  మారింది. ఇది ఎక్కడ జరిగిందో వివరాలులేవు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Dog, England, VIRAL NEWS

ఉత్తమ కథలు