Online Baby: ఆన్‌లైన్ ద్వారా గర్భం దాల్చిన ఇంగ్లండ్ మహిళ.. ఎలాగో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

కొంతకాలం క్రితం భర్తతో గొడవల కారణంగా విడిపోయిన ఆ మహిళ. రెండో సంతానం కోసం ఈ ఆన్‌ లైన్ బేబీ విధానాన్ని ఎంచుకుంది. ఆస్పత్రుల్లో భారీ ఖర్చయ్యే అవకాశముండటంతో యూట్యూబ్ ను ఆశ్రయించింది.

  • Share this:
ప్రస్తుతం ప్రపంచం అన్ని రంగాల్లో పరుగులు పెడుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. ఆన్ లైన్ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. ఇదే ఆన్ లైన్ ఓ మహిళను తల్లిని చేసిందంటే నమ్ముతారా..? అవును ఇది నిజమే..! ఇంగ్లండ్ (England) కు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ (Online) ద్వారా వీర్యదాతను (Sperm Donor) సంప్రదించడమే కాకుండా కృత్రిమ గర్భధారణ కిట్‌ ను ఆర్డర్ చేసి సింపుల్‌ గా గర్భం దాల్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొంతకాలం క్రితం భర్తతో గొడవల కారణంగా విడిపోయిన ఆ మహిళ. రెండో సంతానం కోసం ఈ ఆన్‌ లైన్ బేబీ విధానాన్ని ఎంచుకుంది. ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌ షైర్‌కు చెందిన 33 ఏళ్ల స్టెఫానీ టైలర్ అనే మహిళ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. భర్తతో విడిపోయేనాటికి ఆమెకు ఫ్రాంకీ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే తన కుమారుడికి తోడుగా రెండో సంతానం కావాలని స్టెఫానీ కోరుకుంది. దీంతో కృత్రిమ గర్భధారణ పొందాలని నిర్ణయం తీసుకుంది.

దీని కోసం పలు ప్రైవేట్ ఆస్పత్రులను, ఫర్టిలిటీ క్లినిక్‌లను ఆమె సంప్రదించింది. ఐతే కృత్రిమ గర్భం ధరించేందుకు చేసే చికిత్సకు చెప్పిన ఖర్చు విని స్టెఫానీకి దిమ్మతిరిగింది. సుమారు 1600 పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.1.6లక్షలు ఖర్చు అవుతుందని తెలిసి నిరాశ చెందింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు చెప్పిన ఖర్చు భరించలేక తానే స్వయంగా కృత్రిమ గర్భధారణ చేసుకోవాలని స్టెఫానీ టేలర్‌ నిర్ణయించుకుంది.

ఇది చదవండి: పెళ్లై ముగ్గురు పిల్లలున్నా ప్రియుడి మోజులో మహిళ... ఓ అర్ధరాత్రి భర్తను ఏం చేసిందంటే..!


వెంటనే యూట్యూబ్‌, ఇంటర్నెట్ ద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతిపై అధ్యయనం చేసింది. ఆ తరువాత జస్ట్ ఎ బేబీ అనే యాప్ ద్వారా వీర్యదాతను సంప్రదించింది. ఈ యాప్ డేటింగ్ యాప్ తరహాలో పనిచేస్తుంది. వీర్యదాత ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి నుంచి వీర్యాన్ని తీసుకోవాలని స్టెఫానీ భావించింది. అనంతరం వీర్యదాత నేరుగా స్టెఫానీ ఇంటికి వచ్చి వీర్యాన్ని ఇచ్చి వెళ్లిపోయాడు. అనంతరం ఈబేలో కృత్రిమ గర్భధారణ కిట్‌ను ఆర్డర్ అచ్చి తెప్పించుకుంది. ఇంకేముంది యూట్యూబ్‌లో చూపించిన విధంగా కృత్రిమ గర్భధారణ ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేసుకుంది. రెండు వారాల తర్వాత తాను గర్భవతిని అయినట్లు స్టెఫానీ తెలుసుకుంది. అప్పటి నుంచి తగుజాగ్రత్తలు పాటించింది.

ఇది చదవండి: వయసు ఎనిమిదేళ్లు... లక్ష్యం ఎవరెస్ట్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఐఏఎస్ తనయుడు..


ఫలితంగా ఆమె గత ఏడాది అక్టోబర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సదరు చిన్నారికి ఈడెన్‌ అని స్టెఫానీ పేరుపెట్టుకుంది. అయితే.. స్టెఫానీ తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లి, సోదరి పూర్తిగా ఏకీభవించినప్పటికీ.. తండ్రి మాత్రం తొలుత ఆమోదించలేకపోయాడు. కొంత కాలం తరువాత తన మనసు మార్చుని కుమార్తెకు మద్దతుగా నిలిచారు. కాగా అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోతే తాను కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమయ్యేది కాదని స్టెఫానీ అభిప్రాయపడింది. తన కుమార్తె అసలు సిసలైన ఆన్‌లైన్ చిన్నారి అంటూ సంబరపడిపోయింది.

అయితే వీర్యదాత మాత్రం తన వివరాలు గోప్యంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. స్టెఫానీ మరోసారి గర్భం ధరించాలని కోరుకుంటే మరోసారి వీర్యదానం చేసేందుకు తాను సిద్ధమని వీర్యదాత పేర్కొన్నాడు. మరోవైపు తన కుమార్తె ఈడెన్ భవిష్యత్‌లో తన పుట్టుకకు కారణమైన వీర్యదాతను కలవాలనుకంటే తనకు ఎటువంటి అభ్యంతరం ఉండదని స్టెఫానీ చెప్పింది.
Published by:Purna Chandra
First published: