Google: ఇక గూగుల్ సెర్చ్ కు ఫీజు కట్టాలా? సోషల్ మీడియాలో గూగుల్ పై పేలుతున్న జోకులు

గూగుల్ సంస్థపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ఫోటోస్(GooglePhotos)‌ ద్వారా వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న సేవలను ఆ సంస్థ వచ్చే ఏడాది నుంచి విరమించుకోనుంది. వచ్చే సంవత్సరం జూన్ 1 నుంచి క్లౌడ్ ఫోటో స్టోరేజ్‌ సేవలపై ఫీజు విధిస్తామని ఇటీవల గూగుల్ ప్రకటించింది.

news18-telugu
Updated: November 13, 2020, 1:18 PM IST
Google: ఇక గూగుల్ సెర్చ్ కు ఫీజు కట్టాలా? సోషల్ మీడియాలో గూగుల్ పై పేలుతున్న జోకులు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గూగుల్ సంస్థపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ ఫోటోస్‌ ద్వారా వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న సేవలను ఆ సంస్థ వచ్చే ఏడాది నుంచి విరమించుకోనుంది. వచ్చే సంవత్సరం జూన్ 1 నుంచి క్లౌడ్ ఫోటో స్టోరేజ్‌ సేవలపై ఫీజు విధిస్తామని ఇటీవల గూగుల్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లకు నవంబర్ 10 వరకు ఈ వివరాలను గూగుల్ మెయిల్ చేసింది. ఈ నిర్ణయాన్ని వినియోగదారులు జోక్స్, మీమ్స్ ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు హై క్వాలిటీ ఫోటోలను Google Photosలో అపరిమితంగా బ్యాకప్ చేసుకునే వీలు ఉంది. వచ్చే ఏడాది నుంచి గూగుల్ ఫోటోస్‌లో ఫ్రీ స్టోరేజ్‌ను 15GB వరకే గూగుల్ పరిమితం చేయనుంది. ఇంతకు మించి స్టోరేజ్‌ అవసరమైన వారు డబ్బు చెల్లించాల్సిందే. గూగుల్ వన్‌ ద్వారా వినియోగదారులు అదనపు స్టోరేజ్‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ ఇంతకు ముందే గూగుల్ ఫోటోస్‌లో 15GBకి మించి బ్యాకప్‌ చేసుకున్న ఫోటోలు, వీడియోలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఫోటో స్టోరేజ్‌పై గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే దాదాపు 80 శాతం మంది వినియోగదారులు గూగుల్ ఫోటోస్‌లో 15GB లిమిట్‌ను చేరుకోవడానికి కనీసం మూడేళ్లు పడుతుందట.

డ్రైవ్‌లో కూడా మార్పులు

గూగుల్ డ్రైవ్‌లో కూడా చాలా మార్పులు చోటుచేసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Google Driveలో స్టోర్ చేసుకునే షీట్స్, డాక్యుమెంట్స్, స్లైడ్స్, డ్రాయింగ్స్ వంటి సేవలకు కూడా 15 జిబి పరిమితి విధించనున్నట్లు తెలుస్తోంది. డ్రైవ్ కోసం అవసరమైన ఎడిషనల్ స్టోరేజ్‌ను వినియోగదారులు గూగుల్ వన్ ద్వారా కొనుగోలు చేయాలి. ఈ నిర్ణయం ప్రభావం కూడా సాధారణ వినియోగదారులపై పెద్దగా ఉండకపోవచ్చు. గూగుల్ నుంచి వచ్చిన పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్‌లకు స్టోరేజీపై ఎలాంటి పరిమితులు ఉండవు. వారు ఇంతకు ముందులాగే అపరిమితంగా ఫోటోలను బ్యాకప్‌ చేసుకోవచ్చు.


జోకులు, మీమ్స్‌ పోస్ట్ చేస్తున్న వినియోగదారులు
గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు విమర్శిస్తున్నారు. స్టోరేజీకి డబ్బు చెల్లించాలనే నిర్ణయంపై సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో గూగుల్ సెర్చ్‌ కోసం కూడా ఫీజు చెల్లించాలేమో అని ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. మళ్లీ పాత రోజుల మాదిరిగా స్టోరేజ్ డివైజ్‌లు, ఎస్‌డీ కార్డులకు డిమాండ్ పెరుగుతుందని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇలాంటి జోక్స్, మీమ్స్ ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ట్రెండింగ్‌గా మారుతున్నాయి.
Published by: Nikhil Kumar S
First published: November 13, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading