బిహార్‌లో ఆగని మృత్యు ఘోష...గోవాలో పాశ్వన్ తనయుడు పార్టీ

బిహార్‌లో 108 మంది చిన్నారులు మృతి చెంది విషాదఛాయలు నెలకొంటున్న వేళ...ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వన్ తనయుడు చిరాగ్ పాశ్వన్ గోవాలో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు వివాదాస్పదమవుతున్నాయి.

news18-telugu
Updated: June 18, 2019, 6:18 PM IST
బిహార్‌లో ఆగని మృత్యు ఘోష...గోవాలో పాశ్వన్ తనయుడు పార్టీ
బిహార్‌లో 108 మంది చిన్నారులు మృతి చెంది విషాదఛాయలు నెలకొంటున్న వేళ...ఎల్జేపీ చీఫ్ రాంవిలాస్ పాశ్వన్ తనయుడు చిరాగ్ పాశ్వన్ గోవాలో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు వివాదాస్పదమవుతున్నాయి.
news18-telugu
Updated: June 18, 2019, 6:18 PM IST
బిహార్‌లో చిన్నారుల మృత్యు ఘోష కొనసాగుతోంది. ముజఫర్‌పూర్ జిల్లాలో అక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) బారిన పడి మరణించిన చిన్నారుల సంఖ్య 108కి చేరింది. చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. రాష్ట్రంలో మరణమృదంగం కొనసాగుతున్న వేళ బిహార్‌కు చెందిన ఓ నాయకుడు పీకల్లోతు వివాదంలో కూరుకుపోయాడు. లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ గోవాలో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలను కాంగ్రెస్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ రాధిక కీరా ట్వీట్ చేశారు.  బిహార్‌లో తీవ్ర విషాద పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎంపీ చిరాగ్ పాశ్వాన్ గోవాలో పార్టీ చేసుకుంటున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Loading...


కాగా పరిస్థితి సమీక్షించేందుకు సీఎం నితీశ్ కుమార్ ముజఫర్‌పూర్‌కు వచ్చిన సమయంలో నిరసనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రి దగ్గర కూడా సీఎం గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం రోజున చిన్నారుల మరణాలపై మీడియాతో మాట్లాడుతున్న సమయంలో బిహార్ సీఎం మంగళ్ పాండే భారత్-పాక్ మ్యాచ్ స్కోర్ గురించి ఆరా తీయడం వివాదాస్పదంగా మారింది. అటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్‌తో పాటు పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే కునుకుతీయడంపై కూడా విమర్శలు వచ్చాయి. అయితే ప్రెస్‌మీట్‌లో తాను కునుకుతీసానన్న విమర్శలను తోసిపుచ్చిన మంత్రి...అప్పుడు తాను దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...