కొన్నిసార్లు కొందరి వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో ఊహించనంత డబ్బు వచ్చి పడుతుంది. అయితే అతడు దాని గురించి ఆరా తీసే లోపుగానే ఆ మొత్తం మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంది. ఇలాంటి వార్తలు మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే అలా వచ్చిన డబ్బుతో పరారైన వ్యక్తుల గురించి మనం ఎప్పుడూ విని ఉండం. కానీ ఇక్కడ అదే జరిగింది. చిలీకి చెందిన ఓ వ్యక్తి విషయంలో ఈ రకమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫీస్ నుంచి సకాలంలో జీతం వచ్చింది కానీ.. జీతం (Salary) కంటే వందల రెట్లు ఎక్కువ డబ్బు అతని ఖాతాలో చేరింది. ఆఫీసు తన తప్పును తెలుసుకునే సమయానికి ఆ ఉద్యోగి తన తెలివితేటలు ప్రదర్శిచేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి ఖాతాలో అతని జీతం కంటే 286 రెట్లు జమ చేశారు. యజమాని డబ్బును తిరిగి తీసుకునే సమయానికి ఆ వ్యక్తి పారిపోయాడు.
ఈ సంఘటన కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ అనే చిలీ(Chili) అతిపెద్ద కోల్డ్ కట్స్ నిర్మాత కంపెనీలో జరిగింది. డబ్బు తీసుకుని పారిపోయిన ఉద్యోగి జాడ లేకపోవడంతో ఇక్కడి కంపెనీ హెచ్ఆర్ (Human Resource Department) విస్తుపోయింది. ఆహార వ్యాపార సంస్థ కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్లో పనిచేస్తున్న ఉద్యోగి జీతం ప్రతి నెలా 500,000 పెసోలు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 43 వేల రూపాయలు. కంపెనీ పొరపాటుగా ఈ ఉద్యోగికి అతని జీతం కంటే 286 రెట్లు అంటే 165,398,851 చిలీ పెసోలను ఈ ఉద్యోగి ఖాతాలో జమ చేసింది. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు 1.5 కోట్లు ఉంటుంది.
ఈ డబ్బు ఖాతాలో చేరడంతోనే సదరు వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బు మళ్లీ కంపెనీకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని అనుకున్నాడో ఏమో.. ఆ మొత్తం సొమ్ముతో ఉడాయించేందుకు సిద్ధమయ్యాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయాడు. ఇప్పటి వరకు అతడు జాడ లేకపోవడంతో కంపెనీ న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయింది. ఈ సంఘటన మే 30న జరిగింది.
ఈ విషయమై కంపెనీ తరఫున డిప్యూటీ మేనేజర్ పోస్టులో పనిచేస్తున్న వ్యక్తిని విచారించగా.. అతడి ఖాతాను తనిఖీ చేశారు. కంపెనీ నుంచి పొరపాటున వచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా.. అందుకు అంగీకరించాడు. మరుసటి రోజు వారు అతని కోసం వేచి ఉన్నారు. కానీ బ్యాంకు నుండి ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవడంతో కంపెనీ అతడిని సంప్రదించింది. అయితే అతడు ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు కంపెనీకి చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.