EMERGENCY A BLACK SPOT ON INDIAS VIBRANT DEMOCRACY PM MODI IN GERMANY PAH
PM Modi: ‘భారత ప్రజా స్వామ్యానికి ఎమర్జెన్సీ ఒక మచ్చలాంటిది’.. జర్మనీ ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీ..
సమావేశంలో మాట్లాడుతున్న మోదీ
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రధాని మోదీ (PM Modi) జర్మనీలో జీ 7 దేశాల సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం.. ఆడి డోమ్ ఇండోర్ ఎరీనాలో భారీ ఎత్తున సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మ్యూనిచ్ లో జరిగిన సభలో.. ప్రవాస భారతీయులను ఉద్యేషించి మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పగలడని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను కొనియాడుతూ.. 47 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ (Congress party) భారత సజీవ ప్రజాస్వామ్యానికి (Emergency block day) నల్ల మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. నలభై ఏడేళ్ల క్రితం ప్రజాస్వామ్యాన్ని బందీగా ఉంచి అణిచివేసే ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ ను విమర్శించారు.
భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి (Democracy) ఎమర్జెన్సీ ఒక నల్ల మచ్చ అని G7 సమ్మిట్‌లో పాల్గొనడానికి జర్మనీని సందర్శించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని అన్నారు. భారతీయులమైన మనం ఎక్కడ నివసించినా మన ప్రజాస్వామ్యం గురించి గర్వంగా భావిస్తున్నాం.
#WATCH | Germany: Prime Minister Narendra Modi receives a warm welcome by the Indian diaspora in Munich pic.twitter.com/W8nEz56iBY
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పగలడని అని ప్రధాని మోదీ అన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ తర్వాత... మార్చి 21, 1977న ఎత్తివేయబడింది. ఈ మధ్య కాలంలో అనేక అణచివేత కార్యక్రమాలు జరిగాయి.
'భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) జర్మనీలోని (germany) మ్యూనిచ్‌లో సమావేశంలో అన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిలాంటిదని ఆయన అన్నారు. భారత సాంస్కృతిక వైవిధ్యం, ఆహారం, వస్త్రధారణ, సంగీతం, సంప్రదాయాలన్నీ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని ప్రధాని మోడీ అన్నారు. కొత్త పారిశ్రామిక విప్లవానికి భారత దేశం ప్రొత్సహిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
నేడు భారత్ లోని ప్రతి గ్రామంలో విద్యుత్ సదుపాయం ఉందని.. 99 శాతం గ్రామాల్లో వంట గ్యాస్ వాడుతున్నారని ప్రధాని తెలిపారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు గత రెండేళ్లుగా ఉచిత రేషన్ అందిస్తున్నామని మోడీ స్పష్టం చేశారు. గతంలో.. పారిశ్రామిక విప్లవంతో జర్మనీ, ఇతర దేశాలు లబ్ధి పొందాయన్న ప్రధాని మోడీ.. అప్పట్లో మన దేశం వలస రాజ్యంగా ఉండేదని, అందుకే ఆ ఫలాలను పొందలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ప్రస్తుతం.. పారిశ్రామిక విప్లవం విషయంలో ముందుందని.. ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని తెలిపారు.
అదే విధంగా.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశమైన భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే 10-15 ఏళ్లు పడుతుందనే మాటలు వినిపించాయని ప్రధాని అన్నారు. కానీ ఇప్పటికే మన దేశంలో 197 కోట్ల డోసుల టీకాలు వేశామని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 కోట్ల టాయిలెట్లను నిర్మించిందని మోడీ తెలిపారు. ఈ నేపథ్యలో మోదీ జర్మనీలో జీ7 సదస్సుకు హజరు కానున్నారు. శక్తి, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు, పర్యావరణం, ఆహార భద్రత లపై సమావేశంలో జీ 7 దేశాధినేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.