కొడుక్కి X Æ A-12 అని పేరు పెట్టిన ఎలన్ మస్క్... ఆ పేరుకి అర్థమేంటి?

రోదసీ ప్రయాణాలు, ప్రయోగాలపై ఆసక్తి చూపించే ఎలన్ మస్క్... తన కొడుక్కి పెట్టిన పేరుపై ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది.

news18-telugu
Updated: May 9, 2020, 7:16 AM IST
కొడుక్కి X Æ A-12 అని పేరు పెట్టిన ఎలన్ మస్క్... ఆ పేరుకి అర్థమేంటి?
కొడుక్కి X Æ A-12 అని పేరు పెట్టిన ఎలన్ మస్క్... ఆ పేరుకి అర్థమేంటి? (credit - twitter - AVA)
  • Share this:
ఎవరైనా పిల్లలకి... వారసత్వంగా వచ్చే పేర్లనో, దేవుడి పేర్లనో లేదంటే... పలికేందుకు తేలిగ్గా ఉండే పేర్లను పెడతారు. అమెరికా రోదసీ ప్రయోగాల ఖగోళ వేత్త, టెస్లా కంపెనీ CEO... ఎలన్ మస్క్ మాత్రం... తన కొడుక్కి... "X Æ A-12 మస్క్" అని పేరు పెట్టాడు. ఇది తెలిసిన నెటిజన్లు నిజంగానే షాక్ అయ్యారు. "అదేం పేరు" అని కొందరు అంటే... "అది ఎలా పలకాలి" అని మరికొందరు... "దాని అర్థమేంటి" అని ఇంకొందరు... ప్రశ్నలు వెయ్యగా... కొందరు నెటిజన్లు విమర్శలు చేసి, సెటైర్లు కూడా వేశారు. మొత్తంగా ఈ పేరు సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేసింది. కమెడియన్ జాయ్ రోగాన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఆ పేరుకి అర్థమేంటే... ఎలన్ మస్క్ వివరించాడు.


నిజానికి ఈ పేరును డిసైడ్ చేసింది ఎలన్ మస్క్ కాదట. ఆయన పార్ట్‌నర్ గ్రిమ్స్ అట. ఈ పేరులో... ప్రజలు పిలవాల్సింది మొదటి అక్షరమైన X అని ఎలన్ మస్క్ తెలిపాడు. ఇక... నెక్ట్స్ ఉన్న Æ (AE) ని... యాష్ అని పలకాలట. ఇక ఈ పేరులోని A-12కి ప్రత్యేక అర్థం ఉందన్నాడు. ఈ A-12 ఎందుకు చేర్చారని రోగాన్ ప్రశ్నించగా... A-12 అనేది... ఆర్కాంజెల్ 12 (Archangel 12) అనీ... అది ప్రపంచంలో అత్యంత చల్లటి విమానం అని తెలిపాడు.


ఈ ఆర్కాంజెల్ 12 అనేది ఓ నిఘా విమానం. 1960లో అమెరికా సీక్రెట్ ఏజెన్సీ CIA దీన్ని తయారుచేసింది. ఇది ఏ ఆయుధాలనూ మోసుకెళ్లదు. అమెరికాపై ఎవరైనా భూమి నుంచి క్షిపణులు ప్రయోగిస్తే... వాటిని కనిపెట్టేందుకు దీన్ని తయారుచేశారు.


ఎలన్ మస్క్ పార్ట్‌నర్ ఆ పేరుకి మరికొంత వివరణ ఇచ్చాడు.
•X - తెలియనిది.
•Æ - ప్రేమ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
•A-12 = అర్కాంజెల్.


మొత్తంగా ఈ పేరును ఎలా పలకాలంటే... "ఎక్సాషే ట్వల్వ్" అట. ఏమైతేనేం... ఈ పేరు మాత్రం... బేబీ బాయ్ నేమ్స్‌లో అరుదైన, చిత్రమైన పేరుగా నిలిచింది.
Published by: Krishna Kumar N
First published: May 9, 2020, 7:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading