X Æ A-12 ఇది పేరు.. ఇదే పేరు... ఓ టెక్ కంపెనీ అధినేత కొడుక్కి పెట్టిన పేరు..

ఈ పేరు వినగానే. మీకు అలవైకుంఠపురములో సినిమాలో సీన్ గుర్తొచ్చిందా? గుర్తు వచ్చినా, రాకపోయినా ఇదే పేరు.

news18-telugu
Updated: May 6, 2020, 3:39 PM IST
X Æ A-12 ఇది పేరు.. ఇదే పేరు... ఓ టెక్ కంపెనీ అధినేత కొడుక్కి పెట్టిన పేరు..
కొడుకుతో ఇలాన్ మస్క్ (Image;Twitter)
  • Share this:
X Æ A-12 ఇదేంటి?, రకరకాల క్యారెక్టర్లు రాసి ఇది పేరు అంటారు అనుకోవద్దు. ఇది పేరే. ఈ పేరు వినగానే. మీకు అలవైకుంఠపురములో సినిమాలో సీన్ గుర్తొచ్చిందా? గుర్తు వచ్చినా, రాకపోయినా ఇదే పేరు. టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెస్లా కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ తన కొడుక్కి పెట్టిన పేరు. ఇలాన్ మస్క్, తన గర్ల్ ఫ్రెండ్ గ్రిమ్స్‌కు మొదటి సంతానంగా కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు X Æ A-12 అని పెట్టారు. X Æ A-12 ‌తో పాటు చివర్లో Musk అని జోడించారు.



అయితే, అసలు X Æ A-12 Musk అనే దానికి అర్థం ఏంటి? అసలు ఇది కూడా ఓ పేరేనా? అని ప్రశ్నించారు. చాలా మంది దీని వెనుక ఏదో ఉంటుందని భావించారు. ఆ కోడింగ్ ఏమై ఉంటుందని తలలు పగలగొట్టుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా జనం దీని మీద బాగా చర్చించుకున్నారు. వారి బాధలు చూసిన ఇలాన్ మస్క్ గర్ల్ ఫ్రెండ్ గ్రిమ్స్ ఆ X Æ A-12 పేరుకు అర్థం చెప్పింది.



అయితే, ఆమె ఇచ్చిన వివరణ కూడా పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ‘నేను చచ్చిపోతా.. నేను చచ్చిపోతా బాబోయ్’ అంటూ సెటైర్లు కూడా వేశారు. కొందరైతే అహనా పెళ్లంట సినిమాలో గుండు హనుమంతరావు లాగా ‘అర్ధం కాలా’ అంటూ బిక్క మొఖం వేశారు. మరికొందరు మాత్రం దీన్ని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.





ఇంకొందరు మాత్రం బావుంది. కొత్తగా ఉందంటూ అభినందిస్తున్నారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: May 6, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading