Home /News /trending /

ELEPHANTS FIGHT WITH HUMAN FOR MATTRESS ENDS IN HILARIOUS COMPROMISE VIDEO GOES VIRAL PAH

Elephant: బెడ్ కోసం గున్న ఏనుగు హంగామా.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో..

బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తిస్తున్న ఏనుగు

బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తిస్తున్న ఏనుగు

Viral video: గున్న ఏనుగు పరుపు కోసం నానా రచ్చ చేసింది. తన కీపర్ ను కాలితో నెట్టుకుంటూ ఫన్నీగా ప్రవర్తించింది.

మన ఇళ్లలో కుక్కలు, పిల్లులను ఎక్కువగా పెంచుకుంటుంటాము. అవి చేసే సరదా పనులు, చిలిపి చేష్టలు మనకు నవ్వులను తెప్పిస్తుంటాయి. కుక్కలు యజమాని ఎటు వెళ్లిన అటూ తోక ఊపుకుంటూ ఫాలో అవుతుంటాయి. అసలు.. ఒక్క నిముషం కూడా వదిలి ఉండవు. బైటకు వెళ్లిన, ఇంటిలో ఉన్న తమ ఓనర్ ను అంటి పెంటుకునే ఉంటాయి. పొరపాటున తమ ఓనర్ ను దగ్గరకు వస్తే... కోపంతో వారిని అరిచి భయపెట్టిస్తాయి. ఇంకా బాల్ తో ఆడుకుంటుంటాయి. ఏదైన వస్తువు తీసుకొచ్చేలా ట్రైనింగ్ ఇస్తే.. ఆ పనులు కూడా చేసేస్తుంటాయి.

మొత్తానికి ఒక నోరు లేకున్న కూడా మనిషి కన్న చాలా విశ్వాసంగా ఉంటాయి. పోరపాటున తమ ఓనర్ ఎక్కడికన్న వెళ్తే తిరిగి వచ్చే వరకు డల్ ఉంటాయి. వేరే ఎవరు తినడానికి ఫుడ్ పెట్టిన అసలు ముట్టుకోవు. ఇలాంటివి మనం చూస్తునే ఉంటాం. ఇక పిల్లులు కూడా తమ యజమానులతో ఎంతో ఫన్నీగా ఉంటాయి. అవి బెడ్ షీట్ లలో దూరిపోతుంటాయి. తమ పంజాతో చిలిపిగా కొడుతూ ఆడుకుంటుంటాయి. కొన్ని చోట్ల గున్న ఏనుగులు కూడా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. గట్టిగా అరుస్తు.. పరిగెడుతూ ఉంటాయి.





ఇప్పటికే గున్న ఏనుగులు (Elephant)  ఫన్నీగా చేష్టల అనేక వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రతిరోజు లకల్లో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. నెటిజన్లు వీటిని చూడటానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ప్రస్తుతం ఒక ఫన్నీ వీడియో (Funny video)  సోషల్ మీడియాలో (Social media)  దర్శన మిస్తుంది.

పూర్తి వివరాలు.. ఒక ఎనిమల్ కీపర్ తన ఇంట్లో ఏనుగులోను (Elephant) పెంచుకుంటున్నాడు. దానికి ఒక చిన్న గున్న ఏనుగు ఉంది. అది తన యజమానితో కలసి తెగ అల్లరి చేస్తుంది. అది చేసే పనులు తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. దాని అల్లరిని భరించలేక, యజమాని దాన్ని వేరే చోట కట్టేసి తాను.. మాత్రం సెపరేట్ గా ఒక బెడ్ మీద పడుకున్నాడు. దీన్ని దూరం నుంచి గున్న ఏనుగు గమనించింది.

వెంటనే పరుగున అక్కడికి చేరుకుంది. చిన్న పిల్లలు తల్లిదండ్రులతో సరదగా అల్లరి చేసినట్లు ఏనుగు కూడా, తన కీపర్ తో బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తించింది. బెడ్ పై నుంచి కీపర్ ను కిందకి తోసేసింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఆకు కుప్పల్లో కాసేపు బొర్లింది. ఆ తర్వాత.. దాని కీపర్ దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని చిన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ ఫన్నీ వీడియో ను ఇండియన్  ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సామ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో షేర్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు