Elephant vs Buffalo: ఏనుగులు మనుషులు పెంచుకునే పెంపుడు జంతువులు కావు... అవి వన్య మృగాలు... వాటికి తిక్కరేగితే ఏమైనా చేస్తాయని ఓసారి ఓ కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. అది నిజమే... ఏనుగులు డిసైడ్ అయితే... అవి చేసే విధ్వంసం మామూలుగా ఉండదు. అందుకే చాలా ఘటనల్లో మనుషుల ప్రాణాలు పోతుంటాయి. ప్రజెంట్ విషయానికి వస్తే... ఎద్దులు, గేదెలూ... కొమ్ములతో కుమ్మేయడాన్ని మనం చాలా సార్లు చూశాం... కానీ ఎద్దు... ఏనుగుతో పెట్టుకోవడం బహుశా చూసి ఉండం. పైకా ఎద్దుకి కొమ్ములుంటే... ఏనుగుకి దంతాలున్నాయి. అవి కొట్టుకుంటే ఏది గెలుస్తుంది అనేది సస్పెన్స్ అయ్యింది. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో ఏనుగు పేరు నాగిలాయ్. గేదె పేరు ఇవియా. షెల్డ్రిక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మొదట కయ్యానికి కాలు దువ్వింది ఏనుగే. గజమే... గేదె దగ్గరకు వచ్చింది. దాంతో భయపడి గేదె... కొమ్ములతో ఏనుగును ఎదుర్కోవడానికి ట్రై చేసింది. ఐతే... ఆ సమయంలో ఏనుగు ప్రశాంతంగా ఉంది. అంటే... దానికి తిక్క రేగలేదు. అందువల్ల అది డిఫెన్స్ ఆడిందే తప్ప గేదెపై దాడి చెయ్యలేదు. కాలుతో తొక్కడాల వంటివీ చెయ్యలేదు.
View this post on Instagram
ఈ పైట్‌లో ఏనుగు చాలా పెద్దది... బలమైనది... అందువల్ల ఏనుగే గెలిచింది. అయినప్పటికీ... గేదె పోరాటతత్వం అందరికీ నచ్చింది. గేదె కూడా... ఏనుగుతో తలపడిందే తప్ప... ఏనుగుకు గాయాలు చెయ్యలేదు. రెండూ దాదాపు డిఫెన్స్ చేసుకున్నాయి.
ఇది కూడా చదవండి:Business Ideas: వెన్న పుట్టగొడుగుల బిజినెస్... ఖర్చు వేలల్లో... లాభాలు లక్షల్లో...
ఇక్కడ ఆసక్తికర విషయం ఒకటుంది. ఆ రెండూ బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఇది ఫ్రెండ్లీ ఫైట్ అన్నమాట. వైరల్ వీడియో కోసం అన్నట్లు ఇలా కొట్టుకున్నాయి. అందుకే ఈ వీడియో అందరికీ నచ్చుతోంది. అవి రోజూ ఆడుకుంటాయనీ... ఆ ఆట కొట్టుకున్నట్లుగా ఉంటుందని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ వారు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS, Viral Video