హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పెంపుడు ఏనుగు బీభత్సం.. యజమానిని తొండంతో పైకెత్తి.. కాలితో తొక్కి ఆ తర్వాత..

పెంపుడు ఏనుగు బీభత్సం.. యజమానిని తొండంతో పైకెత్తి.. కాలితో తొక్కి ఆ తర్వాత..

దాడి చేస్తున్న ఏనుగు

దాడి చేస్తున్న ఏనుగు

West Bengal: పెంపుడు ఏనుగు గ్రామంలో ప్రవేశించింది. ఆ తర్వాత.. ఒకవ్యక్తి దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని తొండంతో గాల్లో పైకి ఎత్తింది.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India

కొందరు ఏనుగులను కూడా తమ ఇంట్లో పెంచుకుంటారు. ఇది చాలా వరకు సరదాగా ఉంటాయి. గున్న ఏనుగులు (Elephant) యజమానులతో సరదాగా ఆడుకుంటుంటాయి. అవి చేసే చేష్టలు ఎంతో నవ్వులు తెప్పిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు.. ఏనుగులు భయానకంగా ప్రవర్తిస్తుంటాయి. మనం తరచుగా ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల మీదకు మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి. అంతే కాకుండా.. వాటికి చిక్కిన వారిని తొండంతో దాడిచేసీ మరీ చంపుతుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. వెస్ట్ బెంగాల్ (West bengal) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మిడ్నాపూర్ లోని రూపనారాయణన డివిజన్ లోని గోవాల్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్ పత్రి గ్రామంలో ఒక ఏనుగు బీభత్సం చేసింది. అక్కడ అడవి నుంచి ఏనుగు గ్రామంలోనికి వస్తుండేది. అయితే.. దాన్ని వారు.. ఏనుగుకు రాంలాల్ అనిపేరు పెట్టుకున్నారు. అయితే.. అది తన గుంపు నుంచి వేరు పడిందో ఏమో కానీ గ్రామంలోనికి ప్రవేశించింది. అప్పుడు.. అది 52 ఏళ్ల వ్యక్తిపై దాడికి పాల్పడింది.

ఒక వ్యక్తిని తన తొండంతో గాల్లో పైకెత్తి కిందపడేస్తూ.. తొండంతో తొక్కి పడేసింది. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. గ్రామస్థులు ఎంతగా అరిచిన ఏనుగు మాత్రం అతగాడికి వదల్లేదు. చాలా సేపు అతడిపై దాడి చేస్తునే ఉంది. చివరకు అది అడవిలోపలికి వెళ్లిపోయింది. వెంటనే గ్రామస్థులు గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతడిని టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయాడని తెలిపారు. కాగా, ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు అటవీశాఖ అధికారులు నిరాకరించారు.

ఇదిలా ఉండగా కేరళలో (kerala) ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

తిరువనంతపురానికి చెందిన విళింజమ్ ప్రాంతానికి చెందిన అపర్ణ అనే మహిళకు శుక్రవారం ఇంటి దగ్గర ఒక పిల్లి (Cat bite) కరించింది. అయితే.. ఆమె వెంటనే తన సబ్బుతో కాలును క్లీన్ చేసుకుంది. ఆతర్వాత... దగ్గరలోని ప్రభుత్వ క్లినిక్ కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ అపర్ణ, తన తండ్రితో కలిసి తన వంతు వచ్చే వరకు అక్కడే ఉన్న బెంచ్ మీద వేచి చూస్తున్నారు. ఇంతలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

 అపర్ణ కూర్చున్న బెంచీ కింద ఒక కుక్క కూర్చుని ఉంది. ఆమె కాలు పొరపాటున కుక్క తోకపై పడింది. దీంతో కుక్క.. బాధతో కుయ్ అంటూ అరుస్తూ..  ఆమె కాలిని కరిచి (Dog bite) గాయపర్చింది. వెంటనే ఆమె భయపడిపోయింది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె కాలును సబ్బుతో కడుక్కొమని చెప్పి, కట్టు కట్టి.. మరో ఆస్పత్రికి పంపించారు. దీంతో పాపం... ఆమె అసలే.. పిల్లి కరిచిందని బాధలో ఉండగా, ఇప్పుడు దానికి తోడు కుక్క కూడా కరిచింది. మహిళ తెగ భయపడిపోతుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, West Bengal

ఉత్తమ కథలు