Home /News /trending /

Viral: గజరాజును గొలుసులతో కట్టేసి గొడ్డును బాదినట్టు బాదిన మావటీలు.. వీడియో వైరల్

Viral: గజరాజును గొలుసులతో కట్టేసి గొడ్డును బాదినట్టు బాదిన మావటీలు.. వీడియో వైరల్

ఏనుగును కొడుతున్న మావటీలు (Image : Twitter)

ఏనుగును కొడుతున్న మావటీలు (Image : Twitter)

Elephant: జంతు ప్రేమికులు అవగాహన సదస్సులు పెట్టి మొత్తుకుంటున్నా కొంతమందికి చెవులకెక్కడం లేదు. నోరులేని జీవాలపై మూర్ఖంగా వ్యవహరిస్తూ.. వాటిని గొడ్డును బాదినట్టు బాదుతూ చెప్పనలవి కాని హింసలకు గురి చేస్తున్నారు.

  • News18
  • Last Updated :
    మూగ జీవులను శిక్షించడం.. వాటిపై రాక్షసంగా దాడి చేయడం నేరమని చట్టాలు చెబుతున్నా.. జంతు ప్రేమికులు అవగాహన సదస్సులు పెట్టి మొత్తుకుంటున్నా కొంతమందికి చెవులకెక్కడం లేదు. నోరులేని జీవాలపై మూర్ఖంగా వ్యవహరిస్తూ.. వాటిని గొడ్డును బాదినట్టు బాదుతూ చెప్పనలవి కాని హింసలకు గురి చేస్తున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఒక గజరాజును గొలుసులతో కట్టేసి.. దానిని కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు ఇద్దరు దుండగులు.

    ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులోని తెక్కంపెట్టిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీవిల్లిపుత్తూరు లోని ఆండాల్ ఆలయానికి చెందిన 19 ఏళ్ల ఆడ ఏనుగు ను కోయంబత్తూరు లోని రీహాబిటేషన్ సెంటర్ (పునరుజ్జీవన కేంద్రం) కు తీసుకొచ్చారు దాని నిర్వాహకులు. ఏటా రెండు నెలల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని ఆలయాల్లో ఉండే ఏనుగులను కోయంబత్తూరులోని రీహబిటేషన్ సెంటర్ కు తరలిస్తుంటారు. అదే క్రమంలో బాధిత ఏనుగును కూడా అక్కడికి తరలించారు. వినీల్ కుమార్, శివప్రసాద్ లు ఇద్దరూ దానికి సంరక్షకులు (మావటి వాళ్లు) గా ఉన్నారు.





    అయితే ఏనుగు కాళ్లకు గొలుసులు వేసి చెట్టుకు కట్టేసిన ఆ ఇద్దరు.. దానిపై దాడికి దిగారు. మూగ జీవి అన్న సంగతే మరిచి.. అది దెబ్బలకు అరుస్తున్నా వినిపించుకోకుండా కొట్టారు. దీనిని అక్కడే ఉన్న ఒక వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

    వీడియోను సుమోటాగా తీసుకున్న సదరు అధికారులు.. నిందితులపై విచారణ చేపట్టారు. అయితే ఏనుగు తాము చెప్పిన మాట వినలేదని.. అందుకే దానిమీద దాడికి దిగామని చెప్పుకొచ్చారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ మరిచి ఏనుగుపై దాడికి దిగిన ఆ ఇద్దర్నీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై పలు స్వచ్ఛంద సంస్థలు కూడా నిందితులను శిక్షించాలని కోరుతున్నాయి.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Elephant, Elephant attacks, Tamilnadu, Viral, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు