Home /News /trending /

ELEPHANT SAVES MAN FROM FLOWING WATER VIDEO GOES VIRAL PAH

మానవత్వం అంటే మనుషులకేనా... ఏనుగు చేసిన పనికి శభాష్ అంటున్న నెటిజన్లు..

నీటిలో వ్యక్తిని కాపాడుతున్న ఏనుగు

నీటిలో వ్యక్తిని కాపాడుతున్న ఏనుగు

Viral video: వ్యక్తి నదిలో పడి ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నాడు. ఇంతలో అతడిని ఒక గున్న ఏనుగు చూసింది. వెంటనే నదిలోకి దిగింది.

మనలో చాలా మంది పక్కవాళ్లను అసలు పట్టించుకొరు. ఎవరు ఎటు పోతే మాకేంటీ అని భావిస్తుంటారు. పొరపాటున ఆపదలో ఉన్నా.. ఏదైన సహాయం అడిగిన చేసే అవకాశం ఉన్న అసలు చేయరు. మరికొందరు ఎక్కడ సహాయం అడుగుతామో అని .. ముందే ముఖం చాటేసుకుంటారు. కొంత మంది వీరికి భిన్నంగా ఉంటారు. అయితే.. కొన్ని సందర్భాలలో మనుషుల కన్నా నోరులేని మూగ జీవాలనే నయం అనిపిస్తుంటుది. వాటికి కొంచెం అన్నంపెట్టిన అవి ఎంతో విశ్వాసంగా ఉంటాయి. కొన్ని సార్లు.. ఆపదలో ఉన్న యజమాని కోసం ప్రాణాలను సైతం లెక్కచేయవు. ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నది పక్కన ఒక ఏనుగుల (Elephant) గుంపు ఉంది. అయితే.. ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకొని పోతున్నాడు. ఇంతలో అతడిని ఒక గున్న ఏనుగు చూసింది. వెంటనే పరిగెత్తుకుంటూ నీటిలో దిగింది. అంతటి ప్రవాహాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా.. నదిలో వెళ్లి అతడు కొట్టుకుని పోకుండా తన తుండం అడ్డంపెట్టింది.


దీంతో అతను కాసేపు ఏనుగు ఆధారంతో నిలబడ్డాడు. ఆ తర్వాత.. అతడిని ఏనుగు ఒడ్డువైపు వెళ్లేలా ఆధారాన్నిచ్చింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (social media)  వైరల్ గా (viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొంత మంది మనుషుల కన్నా.. నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో (Delhi) అమానుష సంఘటన జరిగింది.

పశ్చిమ్‌ విహార్‌లో ఈ ఘటన సంభవించింది. రక్షిత్, ధరమ్‌వీర్ దహియా అనే వ్యక్తులు ఒకే ఏరియాలో ఉంటారు. అయితే, రక్షిత్ ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, ప్రతిరోజు అది అరుస్తూ ధరమ్ వీర్ కు ఇబ్బంది కలిగించేది. కొన్ని రోజుల పాటు భరించాడు. ఈ క్రమంలో ధరమ్ వీర్ వాకింగ్ వెళ్లి వస్తుండగా.. కుక్క అతడిని (Barking Hits Dog) కరిచింది.వెంటనే అతను ఇంటికి వెళ్లి ఒక ఇనుప రాడ్ ను తీసుకొచ్చాడు. రక్షిత్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

రక్షిత్, అతని కుక్కపై రాడ్ తో బలంగా కొట్టాడు. దెబ్బకు ఇద్దరు కూడా నెలమీద పడ్డారు. అయితే, మరో మహిళ ధరమ్ వీర్ ను ఆపడానికి ప్రయత్నించింది. అతనిపై కూడా ధరమ్ వీర్ దాడిచేశాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు (viral video)  అయ్యింది. స్థానికులు.. వెంటనే రక్షిత్ , మరో మహిళను ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా కుక్క కరిచిందని ధరమ్ వీర్ కూడా ఆస్పత్రికి వెళ్లాడు. పాపం.. కుక్క తలకు కూడా రక్తం గడ్డ కట్టింది. దాన్ని వెటర్నరీ వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారంతా పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Elephant, Trending video, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు