హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

12 క్రితం తనకి చికిత్స చేసిన డాక్టర్ కనిపించగానే.. ఈ ఏనుగు ఏం చేసిందో తెలుసా?

12 క్రితం తనకి చికిత్స చేసిన డాక్టర్ కనిపించగానే.. ఈ ఏనుగు ఏం చేసిందో తెలుసా?

(Image-Twitter)

(Image-Twitter)

చికిత్స కోసం ఆ ఏనుగును లాంపాంగ్‌లోని ఫారెస్ట్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ప్రాంతానికి తీసుకొచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ అండ్ ప్లాంట్ కన్సర్వేషన్ సిబ్బంది కొన్ని నెలల పాటు ఏనుగుకు చికిత్స అందించారు. పూర్తిగా కోలుకున్న తరువాత మళ్లీ అడవిలోకి వదిలారు.

ఇంకా చదవండి ...

పెంపుడు జంతువులు చూపించే విశ్వాసాన్ని చూసి యజమానులు సంతోషపడతారు. కొన్నిసార్లు అడవి జంతువులు సైతం తమకు ఆహారం అందించిన వారిని గుర్తుపెట్టుకుంటాయి. తాజాగా ఒక ఏనుగు.. కొన్నేళ్ల క్రితం తనకు చికిత్స చేసిన వైద్యుడిని గుర్తించి ప్రేమగా మెలిగింది. ఇన్నేళ్ల తరువాత కూడా అది ఆ వైద్యుడిని గుర్తించడం విశేషం. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది. ఈ సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 31 ఏళ్ల వయసున్న ప్లాయ్ థాంగ్ అనే ఈ అడవి ఏనుగు..12 సంవత్సరాల క్రితం తనకు చికిత్స చేసిన పట్టారాపోల్ మనియోన్ అనే పశువైద్యుని దగ్గరకు వెళ్లింది. అతడిని తొండంతో ప్రేమగా పలకరించింది.

డాక్టర్ మనియోన్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఈ ఘటన జరిగింది. రోజువారీ విధుల్లో భాగంగా అడవిలోకి వెళ్లినప్పుడు ఏనుగు అతడి దగ్గరకు వచ్చింది. ‘ఏనుగును చూడగానే.. అది గుర్తించేలా ప్రత్యేకమైన శబ్దం చేశాను. అది గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చింది. దాని ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లూ అది నన్ను గుర్తుపెట్టుకుంటుందని ఊహించలేదు’ అని మనియోన్ మీడియాకు తెలిపారు. జంతువులు మనుషులపై చూపించే ప్రేమను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అడవి జంతువుల సంరక్షణకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలని చెప్పారు.

మనియోన్ 2009లో మొదటిసారి ఏనుగుకు చికిత్స అందించారు. అప్పటికి ప్లాయ్ థంగ్ తీవ్రమైన అస్వస్థతతో బాధపడుతోంది. దానికి ముఖం, కడుపు, మెడ వాచిపోయాయి. జ్వరం, ఆకలి లేకపోవడం, ఇతర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతోంది. వెన్ను నొప్పితో నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో చికిత్స కోసం దాన్ని లాంపాంగ్‌లోని ఫారెస్ట్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ప్రాంతానికి తీసుకొచ్చారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ అండ్ ప్లాంట్ కన్సర్వేషన్ సిబ్బంది కొన్ని నెలల పాటు ఏనుగుకు చికిత్స అందించారు. పూర్తిగా కోలుకున్న తరువాత మళ్లీ అడవిలోకి వదిలారు.

తాను ఏనుగుకు చికిత్స అందించే సమయంలో అది పూర్తిగా చనిపోయే స్థితిలో ఉందని డాక్టర్ మనియోన్ చెప్పారు. దానికి చికిత్స చేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. అది చాలా దుడుకుగా ఉండేదని తెలిపారు. బలహీన స్థితి నుంచి పూర్తిగా కోలుకునే వరకు దాని ఆరోగ్యాన్ని పర్యవేక్షించానని చెప్పారు. ఏనుగు థాయ్‌లా౦డ్‌ జాతీయ జంతువు కావడం విశేషం. ఆ దేశంలో సుమారు 3000-4000 ఏనుగులు ఉన్నాయి. వీటిలో సగం పెంపుడు జంతువులుగానే ఉండడం విశేషం.

First published:

Tags: Elephant, Thailand, Trending

ఉత్తమ కథలు