Elephant : తన బిడ్డ దగ్గరకు వచ్చిందని.. నీటిలోనే మొసలిని తొక్కిచంపిన తల్లి ఏనుగు.. (వీడియో వైరల్)

బిడ్డ కోసం మొస‌లితో పోరాడిన ఏనుగు(image credit to twitter)

ఏనుగు త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు మొస‌లితో అద్భుత‌మైన పోరాటం చేసింది. త‌న‌కు దంతాలు లేకున్నా స‌రే దానితో పోరాడి త‌న బిడ్డ‌ను కాపాడుకుంది. ఈ పోరాటంలో మొస‌లి ఓడిపోయింది. ఏనుగు దాడికి మొస‌లి విల‌విల‌లాడిపోయింది. చివ‌ర‌కు ఏనుగు పైచేయి సాధించి త‌న బిడ్డ‌ను కాపాడుకుంది.

  • Share this:
    Elephant : ఈ సృష్టిలో తల్లి ప్రేమకు ఎవరూ విలువ కట్టలేరు. ప్రకృతి ప్రసాదించిన గొప్పవరాల్లో తల్లి ప్రేమ ఒకటి. అది మనుషుల్లోనైనా, జంతువుల్లోనైనా.. తల్లి ప్రేమ మాత్రం కామన్. అయితే, తమ పిల్లలకు ఏదైనా అయ్యిందని తెలిస్తే తల్లి హృదయం అసలు తట్టుకోలేదు. అలాంటిది వారికి ఎవరైనా అపాయం తలపెడుతున్నారని భావిస్తే అస్సలు సహించరు. ఈ నేపథ్యంలోనే తన బిడ్డకు సమీపంగా వచ్చిందని ఓ తల్లి ఏనుగు నీటిలోనే మొసలిని తొక్కి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    దంతాలు లేకున్నా తొండంతో కుమ్మి..

    జాంబియా దేశంలోని సఫారీ పార్కులో నీరు తాగేందుకు కొలను వద్దకు ఏనుగుల గుంపు వచ్చింది. అయితే, నీరు కనిపించగానే పిల్ల ఏనుగులు అందులోకి దిగి తెగ ఎంజాయ్ చేస్తాయి. ఈ క్రమంలోనే నీటిలో ఉన్న ఓ మొసలి ఏనుగుల గుంపుకు సమీపంలో ఉన్న నీటిలో ఆడుకుంటున్న పిల్ల ఏనుగు వద్దకు సమీపించడానికి ప్రయత్నించింది. అది గమనించిన తల్లి ఏనుగు తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి మొసలి మీద దాడికి దిగింది. సాధారణంగా మొసలి నేలపై ఉన్నపుడు కంటే నీటిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటుందని, వెయ్యి ఏనుగుల బలం దాని సొంతమని.. కొన్నిసార్లు ఏనుగులు నీరు తాగుతున్న సమయంలో తొండాలను, కాళ్లను తన నోటితో గట్టిగా పట్టుకుని చంపేందుకు యత్నిస్తుందని చిన్నప్పుడు మనం చదివే ఉంటాం.


    అలాంటిది నీటిలో ఉన్న మొసలి ఆ తల్లి ఏనుగు తొక్కి చంపేసింది. అంతకు ముందుకు తన బిడ్డను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించింది. మొసలి తోకను తొండంతో పట్టుకుని వెనక్కి లాగి, దాని పొట్టపై కాలితో బలంగా నొక్కిపెట్టింది. ఆ తర్వాత తొండం, తల సాయంతో కుమ్మిపడేసింది. అంతటితో వదలకుండా మొసలి తోకను తొండంతో పట్టుకుని దూరంగా విసిరేందుకు యత్నించింది. ఇలా చాలా సేపు జరిగిన పెనుగులాటలో చివరకు మొసలి ప్రాణాలు కోల్పోయింది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘హన్స్ హెన్రిక్ హహర్’ అనే ఫొటో‌గ్రాఫర్ షూట్ చేశాడు. ఈ వీడియోను యూ ట్యూబ్ లో పోస్టు చేయగా తక్కువ సమయంలోనే 4లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తన బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎంతటి శక్తితో అయినా పోరాడుతుందని ఓ నెటిజన్ ఇలా రాసుకొచ్చారు.
    Published by:Nagam Mallesham
    First published: