Viral Video: రోడ్డుపైకి వచ్చి ఫుడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన ఎనుగు..!

భూమి మీద ప్రతి ప్రాణి ఏం చేసినా తమ కడుపు నింపుకోవడానికే. కానీ ఇటీవలి కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో వన్యప్రాణలుకు ఆహారం దొరకడం లేదు.

news18-telugu
Updated: September 19, 2020, 3:55 PM IST
Viral Video: రోడ్డుపైకి వచ్చి ఫుడ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన ఎనుగు..!
రోడ్డపై నిల్చుని ఆహారాన్ని సేకరిస్తున్న ఎనుగు(ఫొటో క్రెడిట్-youtube/the safari tube)
  • Share this:
భూమి మీద ప్రతి ప్రాణి ఏం చేసినా తమ కడుపు నింపుకోవడానికే. కానీ ఇటీవలి కాలంలో అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో వన్యప్రాణలుకు ఆహారం దొరకడం లేదు. దీంతో అవి జనావాసాల వైపు కదులుతున్నాయి. ముఖ్యంగా ఎనుగులు గురించి అయితే చెప్పనవసరం లేదు. కొన్ని చోట్ల ఎనుగులు పంటలను నాశనం చేసిన సంఘటనలను కూడా చూశాం. కానీ ఓ ఎనుగు మాత్రం ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలపెట్టకుండా.. రోడ్డుపైకి వచ్చి ఆహారం సేకరించి కడుపు నింపుకునే పనిలో పడింది. టోల్ ట్యాక్స్ మాదిరిగా రోడ్డుపై నిల్చుని ఫుడ్ కలెక్ట్ చేసింది. రెండేళ్ల క్రితం యూట్యూబ్ పోస్ట్ చేసిన వీడియో.. మరోసారి తెగ వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో రోడ్డుపైకి వచ్చి నిల్చున్న ఎనుగు.. దాదాపు సగం రోడ్డును అక్రమించేసింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తొలుత బయపడ్డారు. కానీ ఆహారం సేకరించే పనిలో ఉండటంతో.. దానికి తమ వద్ద ఉన్న ఆహారం అందజేస్తూ ముందుకు సాగారు. చాలా మంది వాహనదారులు భయంతో ఆహారాన్ని దూరం నుంచి ఎనుగు వైపుకు ఆహారాన్ని విసరగా.. కొందరు మాత్రం వాహనానాలకు ఎనుగు దగ్గరివరకు తీసుకె్ళ్లి దాని చేతికి ఆహారాన్ని అందజేశారు. కాగా, ఈ ఘటన శ్రీలంకలో చోటుచేసుకున్నట్టుగా ఆ వీడియో పోస్ట్ చేసిన ది సాఫరీ ట్యూబ్ యూట్యూబ్ చానల్ పేర్కొంది.  ఆ ప్రాంతంలో దేవాలయాలు వెళ్లే భక్తులు.. ఎనుగులు ఆహారం అందజేస్తారని పేర్కొంది.



వాహనదారులు తనవైపు విసిరిన ఆహారంలో కొంత భాగాన్ని అప్పుడే తింటూ కనిపించిన ఎనుగు.. మరికొంత ఆహారాన్ని కింద కూడబెట్టింది. చాలా సేపటికివరకు రోడ్డుపైనే ఉన్న ఎనుగు.. ఏ ఒక్కరికి ఎటువంటి హాని తలపెట్టకుండా అలాగే నిల్చుతుంది.
Published by: Sumanth Kanukula
First published: September 19, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading