news18-telugu
Updated: November 16, 2020, 1:24 PM IST
Hyundai Kona Electric Car : హ్యూందయ్ కంపెనీ కోనా ఎలక్ట్రిక్ కారు
Hyundai Kona ఎలక్ట్రిక్ కారు (electric car) కొత్త మోడల్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్న వారికి హ్యూండాయ్ కంపెనీ ఓ మైల్డ్ అప్ డేట్ (mild update) ఇచ్చింది. అంటే ఇప్పుడు రివీల్ చేసినదానికంటే చాలా ఫీచర్లు ఇంకా ఉన్నాయన్నమాట. కొత్త సంవత్సరా నికి సరికొత్తగా మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ మోడల్ పై స్టైలింగ్ పై హ్యూండాయ్ బాగా కసరత్తు చేసింది.
క్రాస్ ఓవర్ పొడవు పెరిగిందిఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ గా (cross over) లాంచ్ కానున్న దీనిపై మార్కెట్లో మంచి అంచనాలున్నాయి. ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ లో కొత్త ఫీచర్లు చాలానే ఉన్నాయి. కోనా ముందు భాగాన్ని పూర్తిగా రీ డిజైన్ చేశారు. హెడ్ ల్యాంప్స్ చాలా స్లీక్ గా ఉన్నాయి. కోనా ఎలక్ట్రిక్ కూడా మెచ్యూర్ న్యూ లుక్ వచ్చేట్టు DRLs రీ డిజైన్ విధానం హైలైట్ గా ఉంది. ఈ మార్పులతో వెహికల్ పొడవు 40mm వరకు పెరిగింది. మొత్తం 16 ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఈ మోడల్ రిలీజ్ కానుంది. ఆఫర్లో ఉన్న 8 రంగులకు ఆసక్తికరమైన పేర్లు సైతం పెట్టారు.
క్యాబిన్ లో భారీ మార్పులు
హ్యూండాయ్ క్యాబిన్లో భారీ మార్పులు చేశారు. టచ్ స్క్రీన్ ను అప్ డేట్ చేశారు. 10.25 ఇంచ్ డిస్ ప్లే తో పెద్దగా కనిపించనుంది. హయ్యర్ ట్రిమ్ మోడల్ (higher trim model) లో హ్యూండాయ్ బ్లూ లింక్ (Hyundai blue link) కూడా అందుబాటులోకి వస్తోంది. 8 ఇంచుల టచ్ స్క్రీన్ స్టాండర్డ్ గా ఉండనుంది. 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. 39.2-kWh 64-kWh బ్యాటరీ ఆప్షన్స్ ను కల్పిస్తోంది. ఇవి 135hp, 204 hp జనరేట్ చేస్తాయి. రెండు బ్యాటరీలు 395 Nm టార్క్ జనరేట్ చేస్తాయి. కోనా ఎలక్ట్రిక్ పెద్ద బ్యాటరీ డ్రైవింగ్ రేంజ్ తో 480km డెలివర్ చేస్తుందని హ్యూండాయ్ ప్రామిస్ చేస్తోంది. చిన్నదైతే 305 km డెలివర్ చేస్తుందని సంస్థ ప్రకటించింది.
ధరలు
ప్రీ-ఫేస్ లిఫ్ట్ హ్యూండాయ్ కోనా ఎలక్ట్రిక్ ను మనదేశంలో 2019లోనే లాంచ్ చేసిన సంస్థ మరిన్ని ఆధునిక సొబగులు జోడించేందుకు కసరత్తులు చేసింది. కోనా ఎలక్ట్రిక్ ధరలు రూ.23.7 లక్షల నుంచి 23.9 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. ప్రస్తుతానికైతే సరికొత్త 2021 కోనా ఎలక్ట్రిక్ మోడల్ ధరలపై మాత్రం హ్యూండాయ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ భారత్ మార్కెట్లో అడుగు పెట్టేసమయానికి కొత్త ధరలను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్ వీటిదే
మనదేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ (electric car sales) మొదలయ్యాయి. పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ కార్ల వినియోగాన్ని మరింత పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు మహీంద్రా, టాటా, హ్యూండాయ్ వంటి కంపెనీలు మాత్రమే బ్యాటరీ కార్ల రేస్ లో ఉన్నాయి. చూసేందుకు సూపర్ లుక్ తో పాటు మంచి మైలేజ్ ఇచ్చే వీటికి మనదేశంలో మంచి డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఇదంతా సాధ్యమయ్యేందుకు మరికొంత సమయం పట్టచ్చు. బ్యాటరీ కార్ల వినియోగానికి అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అయ్యేవరకు ఇవి మన మార్కెట్లో పెద్దగా పుంజుకోవు. కనుక ఇలాంటి ఏర్పాట్లను సమకూర్చే పనుల్లో పలు కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి.
ధరలు తగ్గుతాయి
మరోవైపు వీటిని కొనే వినియోగదారులపై ఆదయంపన్ను మినహాయించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. బ్యాటరీ కార్లపై 12శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది కూడా. అయితే వీటి ధరలు అధికంగా ఉండటంతో సేల్స్ అంతంతమాత్రమే నమోదయ్యాయి. 2040 నాటికి మనదేశంలో బ్యాటరీ కార్లు 28 శాత వరకు ఉండచ్చని అంచనాలున్నాయి. 2030 తరువాత వీటి ధరల్లో భారీగా తగ్గుదల ఉంటుంది కనుక కస్టమర్లు పెట్రోల్, డీజల్ కార్ల బదులు ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంటారు.
Published by:
Krishna Adithya
First published:
November 16, 2020, 1:24 PM IST