హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదేంది సామి.. పొల్యుషన్ సర్టిఫికేట్ లేదని ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఫైన్.. ఎక్కడంటే..

ఇదేంది సామి.. పొల్యుషన్ సర్టిఫికేట్ లేదని ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఫైన్.. ఎక్కడంటే..

అధికారులు వేసిన చలాన్

అధికారులు వేసిన చలాన్

Kerala: రోడ్డు మీద ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొని వెళ్తున్నాడు. ఇంతలో అతగాడి ఇంటికి ఈ చాలాన్ వచ్చింది. అది చూసి దాని యజమాని నోరెళ్లబెట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kerala, India

సాధారణంగా మనం ట్రాఫిక్ నిబంధనలను అతి క్రమిస్తే పోలీసులు ఫైన్ వేస్తుంటారు. ట్రిబుల్ రైడింగ్ చేసి, తాగి వెహికల్ నడిపించడం, రాంగ్ రూట్, బెల్ట్ పెట్టుకోకుంటే జరిమాన విధిస్తుంటారు. మరికొన్నిసార్లు.. బండికి సంబంధించిన సరైన కాగితాలు.. లైసెన్స్, ఆర్సీ, పొల్యుషన్, ఇన్సూరేన్స్ లేకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారనే విషయం మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమాన చూసి స్కూటర్ యజమాని షాక్ కు గురయ్యాడు.పూర్తి వివరాలు.. కేరళలో (kerala)  వింత ఘటన జరిగింది. మలప్పురంజిల్లాలోని నీలంచెరిలో ట్రాఫిక్ పోలీసులు ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఫైన్ వేశారు. వెహికిల్ యజమాని ఇంటికి ఈ చలాన్ వచ్చింది. దీనిలో పొల్యుషన్ సర్టిఫికేట్ లేని కారణంగా జరిమాన విధించినట్లు ఉంది. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు. రశీదుపై 250 రూపాయల జరిమాన విధించబడి ఉంది. దీంతో యజమాని షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆ ఫోటోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ గా (viral news)  మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.


ఇదిలా ఉండగా బ్రిడ్జ్ ప్రారంభించగానే అనుకొని ఘటన జరిగింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గ్రామంలో అధికారులు వంతెనను ప్రారంభించడానికి వచ్చారు. ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న తమ సమస్య నేటితో దూరమైపోతుందని ప్రజలు కూడా పెద్ద ఎత్తున హజరయ్యారు. కార్యక్రమంలో అట్టహసంగా జరుగుతుంది. బ్రిడ్జ్ పైన వెళ్లడానికి ఒక ప్రత్యేక మార్గంను ఏర్పాటు చేశారు. అక్కడ రిబ్బన్ కూడా కట్టారు. అక్కడికి స్థానిక మహిళా అధికారిణి, ఇతర అధికారులు, నాయకులు హజరయ్యారు. అప్పుడు ఒక ఊహించని ఘటన జరిగింది. రిబ్బన్ కట్ చేయగానే ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలిపోయింది.
దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. మహిళ అధికారి పక్కన ఉన్నతోటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అధికారిణిని జాగ్రత్తగా అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. మిగతా వారు కూడా మా మీద ఎక్కడ పడుతుందో బ్రిడ్జ్ అంటూ.. దూరంగా వెళ్లిపోయారు. ఈ ఘటనను స్థానికులు రికార్డు చేశారు. దీనిపై లోకల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Kerala, Traffic challans, VIRAL NEWS

ఉత్తమ కథలు