Home /News /trending /

EDUCATED MAN SELLING PEANUTS AT A BUS STAND SPEAKING ENGLISH AND HINDI IN CHHATTISGARH VIDEO VIRAL SNR

Video Viral : బస్టాండ్‌లో శనగలు అమ్ముతూనే .. అతను ఏం చేస్తున్నాడో ఈ వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral: టాలెంట్ ఉన్న వాళ్లకు గుర్తింపు దానంతటకి అదే వస్తుంది. వాళ్లు రోడ్లపై పల్లీలు అమ్ముకున్నా ... బస్టాండ్‌లలో శనగలు విక్రయించినా ఇట్టే పబ్లిక్‌ కళ్లలో పడతారు. వాళ్ల టాలెంట్‌తో సోషల్ మీడియాలో హీరోలుగా చలామణి అవుతారు. ఆమధ్య బెంగాల్‌లో భుబన్‌ బద్యాకర్‌ కచ్చా బాదమ్ సాంగ్‌తో పాపులర్ అయినట్టే ఇప్పుడు చత్తీస్‌గడ్‌లో ఓ శనగల వ్యాపారి ఇంగ్లీష్, హిందీ భాషతో వార్తల్లోకెక్కాడు.

ఇంకా చదవండి ...
వ్యాపారం చేయాలంటే కస్టమర్లను ఆకర్షించే టాలెంట్ ఉండాలి. లేదంటే ఎంత పెద్ద బిజినెస్(Business)చేసినా ప్రయోజనం ఉండదు. ఫుట్‌పాత్‌(Footpath)పై షాపులు, బస్టాండ్‌(Bus stand)ల దగ్గర చిన్న, చితక వ్యాపారాలు పెట్టుకునే వాళ్లకు ఎలాగైనా గిరాకీ ఉంటుంది కాబట్టే ఆ పరిసరాల్లో వ్యాపారాలు పెట్టుకునే వాళ్లు ఎక్కువగా శ్రమపడరు. కాని చత్తీస్‌ఘడ్‌(Chattisgarh)లో మాత్రం ఓ శనగల వ్యాపారి(Peanuts salesman)మాత్రం బస్సుల్లో ప్రయాణించే వారిని ఆకట్టుకునేందుకు ఓ ప్రత్యేకమైన శైలీని అలవర్చుకున్నాడు. ఇప్పుడు అదే అతని బిజినెస్‌కి పెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారింది.

Sonu Sood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. ఏడేళ్ల చిన్నారికి..



పల్లీల వ్యాపారి స్టైలే వేరు..
అతని పేరు దేవలఖాన్‌ గుప్తా. చత్తీస్‌గడ్‌లోని బలరాంపూర్ జిల్లా రాజ్‌పూర్ బస్టాండ్‌ ఎదురుగా మసాల శనగలను తోపుడు బండిపై పెట్టుకొని అమ్ముకుంటూ జీవనం పొందుతున్నాడు. తోడుపు బండి అంటే ఏదో ముతక బట్టలు, జిడ్డు మొహం, అక్షరజ్ఞానం లేని అమాయకుడు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దేవలాఖాన్‌ గుప్తా మసాల శనగలను అమ్ముకునేందుకు తానే ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. బండికి మైక్ తగిలించి..అందులోనే ప్రయాణికుల్ని రండి బాబు రండి మా దగ్గర ఎంతో నాణ్యమైన.. రుచికరమైన శనగలు అమ్మబడునూ అంటూ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రచారం చేస్తున్నాడు. కేవలం పది రూపాయలకే 50గ్రాములు అంటూ మైకులో బస్టాండ్‌కి వచ్చి పోయే వాళ్లను ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ విధంగా గత 30ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నాడని స్దానికులు చెబుతున్నారు.

మరో భుబన్ బద్యాకర్..
స్వతహాగా చదువుకున్న వ్యక్తి కావడంతో తోపుడు బండిపై వ్యాపారం చేస్తున్నప్పటికి నీట్‌గా షర్ట్, ప్యాంట్‌తో ఎంతో హుందాగా వ్యాపారం చేస్తున్నాడు దేవలాఖాన్‌ గుప్తా. మొదట్లో వచ్చి రాని ఇంగ్లీష్‌తోనే వ్యాపారస్తుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. అయితే ఇంగ్లీష్‌ భాషలో అతనికి మంచి తర్ఫీదు ఇచ్చారు స్నేహితులు. అటుపై దేవలఖాన్‌గుప్తా కేవలం అమ్మే శనగలతో పాటు అవి తింటే కలిగే ప్రయోజనాలను కూడా వివరంగా మైక్‌లో చెబుతూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు.

Lightning Strike : అయ్యయ్యో..ఎంత ఘోరం,పిడుగుపాటుకు 14మంది మృతి



సెలబ్రిటీ అవడం ఖాయం..
వెస్ట్ బెంగాల్‌లో ఇదే విధంగా సైకిల్‌పై శనగలు, పల్లీలు, పప్పు దినుసులు అమ్ముకుంటున్న భుబన్ బద్యాకర్ కూడా ఇదే తరహాలో కచ్చా బాదమ్ అంటూ పాట పాడుతూ వ్యాపారం చేస్తుండే వాడు. అతని పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నపళంగా నైట్ పబ్‌లో లైవ్ సింగర్‌గా మారిపోయాడు. ఇప్పడు దేవలఖన్‌ గుప్తా కూడా తన వీడియో పాపులర్ అయితే ఏ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉద్యోగం సంపాధిస్తాడో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Chhattisgarh, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు