Viral News: జైలులో సాధారణంగా కట్టుదిట్టైన భద్రత ఉంటుంది. అదే విధంగా, నిరంతరం పోలీసులు పహరా కాస్తు, సీసీటీవీ ఫుటేజీలో పర్యవేక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. యూకేలో ఉన్న నార్తంప్టైన్ లోని కొన్ని జైళ్లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఖైదీలను ఉంచే గదులు ఫైస్టార్ హోటల్ లోని రూముల మాదిరిగా ఉండి, దీనికి పెద్ద పెద్ద కిటీకీలు కూడా ఉంటాయి.అంతే కాకుండా వీటికి..
Viral News: జైలులో సాధారణంగా కట్టుదిట్టైన భద్రత ఉంటుంది. అదే విధంగా, నిరంతరం పోలీసులు పహరా కాస్తు, సీసీటీవీ ఫుటేజీలో పర్యవేక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారు. అయితే, యూకే (United Kingdom )లో ఉన్న నార్తంప్టైన్ లోని కొన్ని జైళ్లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఖైదీలను ఉంచే గదులు ఫైస్టార్ హోటల్ లోని రూముల మాదిరిగా ఉండి, దీనికి పెద్ద పెద్ద కిటీకీలు కూడా ఉంటాయి. అంతే కాకుండా వీటికి..
మనకు జైలు అనగానే పకట్భందిగా ఉండే భద్రత, ఎప్పుడు పోలీసులు కాపాలా కాస్తుంటారని మనకు తెలిసిందే. అలాంటి.. జైలులో (Jails) కూడా చిన్న చిన్న ఇరుకైన గదులుంటాయి. వాటిలో ఒకే గదిలో ఇద్దరు లేదా ముగ్గురిని ఉంచుతుంటారు. సరైన పరిశుభ్రతను కూడా పాటించరు.
అయితే, చాలా మంది కొన్ని అనుకొని సందర్భరాలలో చేసిన తప్పుల వలన జైళ్లకు వెళతారు. ఒక్కొసారి క్షణికావేశంలో చేసిన తప్పుల వలన జైల్లో ఊచలు లెక్కిస్తుంటారు. మరికొందరు పగలు, ప్రతీకారాలతో కూడా చేసిన తప్పులకు పోలీసులు వారిని అదుపులోనికి తీసుకుని న్యాయస్థానంలో ప్రవేశపెడుతుంటారు. న్యాయమూర్తి చేసిన తప్పుకు శిక్షను విధిస్తుంటారు. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలిస్తారు.
కొంత మంది ఖైదీలను, పోలీసులు శిక్షలో భాగంగా.. వారితో అనేక పనులు చేయిస్తుంటారు. వారిలో మార్పు రావడానికి తిరిగి సమాజంలో కలిసిపోయే విధంగా పలు కార్యక్రమాలు చేపడతారు. కొందరు ఖైదీలతో రకరకాల వస్తువులు, గార్డెనింగ్, వివిధ రకాలు ఉత్పత్తులను తయారు చేయిస్తుంటారు. దీనిలో పనిచేసిన వారికి జీతం కూడా ఇస్తుంటారు.తీవ్రమైన నేరాలు చేసిన వారి కన్నా.. కోపంతో, క్షణికావేశంలో అనుకోకుండా నేరాలు చేసి జైళ్లకు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు.
అలాంటి వారిలో మార్పులు తేవడానికి పోలీసులు, జైళ్లశాఖ వారు ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపడతారు.వారిని నిరంతరం కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటారు. అయితే, కొన్ని దేశాలు.. తమ ఖైదీలలో మార్పులు తేవడానికి తమ జైళ్లనే ఫైస్టార్ హోటల్ మాదిరిగా మార్చేశాయి.
ఆతర్వాత వారిలో మార్పు తేవడానికి నిరంతం కౌన్సిలింగ్ నిర్వహిస్తు.. శునకాలతో కూడా పలు సెషన్ లు నిర్వహిస్తుంటారు.యూకే (United Kingdom) లోని ఒక జైలులో ఇలాంటి ఈకోఫ్రెండ్లీ జైలును ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ (Viral news) గా మారింది.
పూర్తి వివరాలు.. యూకే లోని నార్తంప్టన్ షైర్ లో హెచ్ఎంపీ వెల్స్ లో జైలు ఉంది. అది మాములుగా ఉండే జైళ్లకు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అది ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుంది. దాని లోపల ఇనుక చువ్వలు ఉండవు. గదిలో విలాస వంతంగా కిటికీలు ఉంటాయి.అందులోని ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించరు. వారికి శునకాలతో ఆడుకోనేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. మానసికంగా బాధపడేవారు శునకాలతో ఆడుకుంటే.. ఒత్తిడి నుంచి బయటపడతారని పలు అధ్యయనాలలో వెల్లడైంది.
యూకేలో ఉన్న ఈకోఫ్రెండ్లీ(Eco friendly Jail) జైలు గత నెలలోని ప్రారంభమైంది. అప్పుడు కేవలం ఒక్కవ్యక్తి మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ జైలులో ఖైదీల సంఖ్య 137 కి చేరింది. అదే విధంగా ఖైదీలకు వినోద కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది. ఖైదీలకు, వారి కుటుంబంలోని పిల్లలతో ఆడుకొవడానికి అవకాశం కూడా కల్పిస్తారు.
ప్రస్తుతం యూకెలో(United Kingdom) ఇలాంటి జైళ్లు నాలుగు ఉన్నాయి. వీటిలో 1700 మంది ఖైదీలు, 700 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఖైదీలకు తమ వారితో వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించారు. అయితే, ఖైదీలలో మార్పులు రావడానికి, తిరిగా వారుసమాజంలో తిరిగి మాములు మనుషుల మాదిరిగా వెళ్లడానికి ఇలాంటి పనులు చేపట్టామని డైరెక్టర్ జాన్ మెక్ లాఫ్లిన్ తెలిపారు. ప్రస్తుతం ఈకోఫ్రెండ్లీ జైలు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.