హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Baahubali Samosa: ఈ సమోసా మొత్తం తింటే.. వెంటనే రూ.51వేలు ఇస్తారు.. అంత సత్తా మీలో ఉందా?

Baahubali Samosa: ఈ సమోసా మొత్తం తింటే.. వెంటనే రూ.51వేలు ఇస్తారు.. అంత సత్తా మీలో ఉందా?

బాహుబలి సమోసా

బాహుబలి సమోసా

Baahubali Samosa: ఇది సాధారణ సమోసాలా ఉండదు. చాలా స్పెషల్. బాహుబలి సమోసాలో ఆలు మసాలాతో పాటు పన్నీర్, డ్రైఫ్రూట్స్ కూడా ఉంటాయి. అందుకే దీని రుచి అద్భుతంగా ఉంటుందని శుభమ్ చెబుతున్నారు

మనలో చాలా మంది వారానికోసారైనా రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం తెస్తుంటారు. ఇంట్లో చేసే రొటీన్ వంటకాలతో బోర్ కొట్టి.. అప్పుడప్పుడూ ఫ్యామిలీతో సరదాగా బయటుకు వెళ్లి.. నచ్చిన ఆహారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. రెస్టారెంట్లు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త వెరైటీలను పరిచయం చేస్తున్నాయి. స్థానిక వంటకాలతో విదేశీ రుచులను కూడా అందిస్తున్నాయి. దీనికి తోడు ఆ మధ్య ఫుడ్ ఛాలెంజ్ కల్చర్ కూడా పెరిగిపోయింది. రెస్టారెంట్లు ఇలాంటి ఛాలెంజ్‌లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ బిర్యానీ తింటే 50 వేలు.. ఆ పానీపూరీ తినగలిగితే లక్ష అంటూ.. ఊరిస్తున్నాయి. తాజాగా మీరట్‌ (Meerut)లో కూడా బాహుబలి సమోసా (Baalbali Samosa Challenge) పేరు బాబా వినిపిస్తోంది. అది మనం తినే సాధారణ సమోసాల్లా ఉండదు. ఏకంగా 8 కేజీల బరువు ఉంటుంది.

గొంగళి పురుగులతో రుచికరమైన చాక్లెట్స్, బిస్కెట్స్.. మీరు కూడా ఇష్టంగా తింటారు

మీరట్‌కు చెందిన శుభమ్‌‌కు లాల్‌కుర్తి బజార్‌లో కౌశల్ స్వీట్స్ పేరుతో స్వీట్ షాపు నిర్వహిస్తున్నాడు. అందులో ఎన్నో వెరైటీల స్వీట్స్, సమోసాలు, పకోడిలు లభమ్యవుతాయి. కస్టమర్లను ఆకట్టునేందుకు ఏదైనా కొత్తగా చేయాలని శుభమ్ ఆలోచించాడు. ఇటీవల ఫుడ్ ఛాలెంజ్‌ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుండడంతో.. మనోడు కూడా అలాంటి ఐడియాతోనే ముందుకొచ్చాడు. ఏకంగా 8 కేజీల సమోసాను తయారు చేశాడు. దానికి బాహుబలి సమోసాగా పేరుపెట్టాడు. ఎవరైనా ఆ బాహుబలి సమోసాను.. కేవలం అరగంటలో తింటే.. ఆ వ్యక్తికి రూ.51 వేల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించాడు. అప్పటి నుంచీ ఈ స్వీట్ షాప్ పేరు మీరట్‌లో మార్మోగిపోతోంది.

శుభమ్ మొదట 4 కేజీల సమోసా తయారు చేశారు. ఆ సమోసా తిన్న వారికి రూ.11వేల నగదు ఇస్తామని ఫుడ్ ఛాలెంజ్ తీసుకొచ్చారు. దానికి భారీగా స్పందన రావడంతో ఇప్పుడు 8 కేజీల బాహుబలి సమోసాను తీసుకొచ్చారు. ఈ సమోసాను తయారు చేసేందుకు గంట నుంచి గంటన్నర సమయం తీసుకుంటాడు. ఇందుకోసం రూ.1100 ఖర్చవుతుంది. ఇది సాధారణ సమోసాలా ఉండదు. చాలా స్పెషల్. బాహుబలి సమోసాలో ఆలు మసాలాతో పాటు పన్నీర్, డ్రైఫ్రూట్స్ కూడా ఉంటాయి. అందుకే దీని రుచి అద్భుతంగా ఉంటుందని శుభమ్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ ఆ బాహుబలి సమోసా ఛాలెంజ్లో విజయం సాధించలేదని వెల్లడించారు. త్వరలోనే 10 కేజీల సమోసాను కూడా తయారు చేస్తానని పేర్కొన్నారు.

First published:

Tags: Food, Up news, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు