• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • EARTH SPINS FASTER THAN EARLIER THEN THERE WILL ONLY BE 59 SECONDS IN A MINUTE NS GH

Earth Spins: మన టైం మారనుందా? సెకనుకు ఇక 60 సెకండ్లు ఉండవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

Earth Spins: మన టైం మారనుందా? సెకనుకు ఇక 60 సెకండ్లు ఉండవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

నిమిషానికి ఎన్ని సెకన్లని చిన్న పిల్లాడిని అడిగినా 60 సెకన్లని టకీమని చెప్పేస్తాడు. అయితే, నిస్సంకోచంగా అది తప్పని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. అయితే, వీటి సమయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Share this:
నిమిషానికి ఎన్ని సెకన్లని చిన్న పిల్లాడిని అడిగినా 60 సెకన్లని టకీమని చెప్పేస్తాడు.. అయితే, నిస్సంకోచంగా అది తప్పని చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఒక రోజు అనగా 24 గంటలు (86,400 సెకన్లు)గా, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లని చిన్నతనం నుంచి చదువుకుంటున్నాం. అయితే, వీటి సమయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? దీనికి ప్రధాన కారణం భూమి భ్రమణం (Earth Spins) కాలక్రమేణా గణనీయంగా మారిపోవడమేనని శాస్త్రవేత్తలు(Scientists) అంటున్నారు. భూమి సహజంగా సూర్యుని చుట్టూ కక్ష్యలోకి తీసుకునే సమయంలో దాని అక్షం మీద 365 సార్లు తిరుగుతుంది. అయితే, భూమి దాని అక్షం మీద ఇప్పుడున్న దానికంటే చాలా వేగంగా తిరుగుతుంది. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి(Earth) సూర్యుని చుట్టూ తిరిగే సమయంలో 420 స్సిన్లను పూర్తి చేసింది. ఇది దాదాపు 444 నుంచి 419 మినియన్ సంవత్సరాల క్రితం జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాలకు భూ భ్రమణ వేగం 410కి నెమ్మదించింది.

భూమి వేగంలో ఇలా మార్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు(Scientists). భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి ప్రధాన కారణం కావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, భూమికి దూరంగా చంద్రుడు కదలడం కూడా ఒక కారకమని చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు భూమి వేగం నెమ్మదించిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా భూమి నెమ్మదించడానికి ఒక లీప్ సెకండ్(Leap Second) సమయం పడుతుంది. కానీ, 2020లో భూమి(Earth) భ్రమణం మళ్లీ వేగవంతమైంది. 2005లో అతి తక్కువ రోజుగా నమోదై రికార్డు నమోదు కాగా, 2020లో ఆ రికార్డు 28 సార్లు బ్రేక్ అయ్యింది. 2020 వరకు ఏడాదిలో సగటున, రోజుకు 0.5 మిల్లీసెకన్లు(Milli seconds) మాత్రమే తక్కువగా నమోదయ్యాయి. దీని ఫలితంగా 2021లో భూమి ఎంతో వేగంగా తిరుగుతోంది.

భూమి వేగంగా తిరగడానికి కారణం?
కాగా.. సమయానికి సంబంధించిన ఇటువంటి గందరగోళం పూర్తిగా క్రొత్తది కాదు. భూమి సమయాన్ని ట్రాక్ చేయడానికి సౌర గడియారాలు, పరమాణు గడియారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు, రెండింటి మధ్య అంతరం ఉంటుంది. 1970ల నుండి, సౌర గడియారం(Clock)తో సుమారు 27 "లీప్ సెకన్లు" (Leap Second) జోడించబడ్డాయి. భూ భ్రమణ చరిత్రలో మొదటిసారిగా నెగెటివ్ లీపు సెకను అవసరం ఏర్పడింది. గత 50 ఏళ్లలో కంటే భూమి ఇప్పుడు వేగంగా తిరుగుతోందని సైంటిస్టులు(Scientists) చెబుతున్నారు. గతంతో పోలిస్తే 2021లో సగటు రోజు సాధారణంగా ఉండే 86,400 సెకన్ల కన్నా 0.05 మిల్లీ సెకన్లు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు