హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Earth Hour 2022: ఈ చీకటి.. రాబోయే తరాల వెలుగు కోసం.. భారత్‌లో ఘనంగా ఎర్త్ అవర్.. ఏంటిది?

Earth Hour 2022: ఈ చీకటి.. రాబోయే తరాల వెలుగు కోసం.. భారత్‌లో ఘనంగా ఎర్త్ అవర్.. ఏంటిది?

ఎర్త్ అవర్ లో భాగంగా ఢిల్లీలో దృశ్యాలు

ఎర్త్ అవర్ లో భాగంగా ఢిల్లీలో దృశ్యాలు

ఎర్త్‌అవర్‌లో భాగంగా ప్రపంచ మానవాళి ఇవాళ రాత్రి 8.30 నుంచి 9.30 మధ్య లైట్లను, విద్యుత్‌ పరికరాలను ఆపేశారు. ఈ కార్యక్రమంలో భారత్ సహా 180కిపైగా దేశాల ప్రజలు పాల్గొననున్నారు.

భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ గంట పాటు చీకట్లోకి మళ్లాయి. విచ్చలవిడిగా పెరిగిపోతోన్న కాలుష్య నివారణ కోసం మానవాళి నిశీధిలోనే ఆత్మావలోకనం చేసుకుంది. రాబోయే తరాలు ఆహ్లాదకరమైన ఉషోదయాలు చూడాలంటే ఇవాళ మనం ప్రకృతిని పాడుచేయకుండా కాపాడుకోవాలనే సందేశంతో ఎర్త్ అవర్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ప్రజల్లో, ప్రభుత్వాల్లో పర్యావరణ స్పృహను పెంచటానికి, భూతాపం తగ్గింపునకు ‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఏటా మార్చి నెల చివరి శనివారం రాత్రి 8:30 గంటలకు ఎర్త్‌ అవర్‌ పేరిట ఒక విస్తృత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈసారి అది మార్చి 26న ‘మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అనే అంశంతో జరిగింది.

Medicine Price Hike: సామాన్యులకు మరో షాక్ -పారాసిటమాల్ సహా 800 రకాల మందుల ధరలు భారీగా పెంపు..

ఈ కార్యక్రమంలో భారత్ సహా 180కిపైగా దేశాల ప్రజలు పాల్గొననున్నారు. ఎర్త్‌అవర్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారసంస్థలు, ప్రభుత్వాలు అత్యవసరం కాని లైట్లను, విద్యుత్‌ పరికరాలను ఒక గంట పాటు స్విచ్‌ ఆఫ్‌ చేయాలనేది లక్ష్యం. భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి, ప్రకృతిని కాపాడాలనే అవగాహన పెంచడానికి దీనిని నిర్వహిస్తున్నారు.

Modi Story: మోదీ ఎవరో తెలీదంటూ పోలీసులకే మోదీ మస్కా.. PM Modi జీవితంలో అనూహ్య ఘట్టాలివే..

ఎర్త్‌అవర్‌లో భాగంగా ప్రపంచ మానవాళి ఇవాళ రాత్రి 8.30 నుంచి 9.30 మధ్య లైట్లను, విద్యుత్‌ పరికరాలను ఆపేశారు. 2008లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ ఇండియా అధికారికంగా ఎర్త్‌అవర్‌ను ప్రారంభించింది వాతావరణ మార్పులు జల వనరులు, వ్యవసాయం, పర్యావరణం, తీరప్రాంతాలు, ఆరోగ్యం తదితర అనేక అంశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు వ్యక్తిగత, సామాజికస్థాయిలో పలు చర్యలు తీసుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

AadhiPinisetty | NikkiGalrani : ఆదితో నిక్కీ నిశ్చితార్థం -ఇండస్ట్రీ నుంచి హీరో నాని ఒక్కడే గెస్ట్?

విచక్షణరహితంగా శిలాజ ఇంధనాలను కాల్చడం, వృక్షసంపదను నిర్మూలించటం వంటి మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తదితర గ్రీన్‌హౌస్‌ వాయువుల మోతాదును గణనీయంగా పెరిగాయి. కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ప్రస్తుతం ఉన్న 387 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) నుంచి 2100 నాటికి దాదాపు వెయ్యి పీపీఎంకి పెరుగుతుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం 13.9 సెంటీగ్రేడ్‌ ఉన్న ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.1 నుంచి 5.4 డిగ్రీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

First published:

Tags: Earth, Nature, Pollution, Viral Videos, WEATHER

ఉత్తమ కథలు