హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Earn Money Online: ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా... రూ.7 లక్షలు మీ సొంతం!

Earn Money Online: ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా... రూ.7 లక్షలు మీ సొంతం!

ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా... రూ.7 లక్షలు మీ సొంతం! (ప్రతీకాత్మక చిత్రం)

ఈ రూపాయి నోటు మీ దగ్గర ఉందా... రూ.7 లక్షలు మీ సొంతం! (ప్రతీకాత్మక చిత్రం)

Earn Money Online: ఈజీగా డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంటే అదృష్టమే. అలాంటి అవకాశం ఒకటి ఇప్పుడు లభిస్తోంది. దాన్ని ఎవరైనా పొందవచ్చు. కాకపోతే... ఆ రూపాయి నోటి వారి దగ్గర ఉండాలి.

  Earn Money Online: మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా... వాటిని ఎక్కడో ఉంచి... మర్చిపోయారా... అయితే... వాటిని బయటకు తియ్యండి... పరిశీలించండి... వాటి ద్వారా మీరు లక్షలు సంపాందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాత నోట్లు, నాణేలను సేకరించేవారు చాలా మంది ఉన్నారు. ఈ హాబీని న్యూమిస్‌మాటిక్స్ (numismatics) అంటారు. ఇది ఉన్నవారు... ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి... అరుదైన పాత నోట్లు, కాయిన్లను కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే... పాతవైన వాటిని యాంటిక్ పీస్‌లుగా పరిగణిస్తారు. అలాంటి వాటికి విలువ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఓ రూపాయి నోటును రూ.5 లక్షలకు కొన్న వ్యక్తి... భవిష్యత్తులో దాన్ని వేలం పెడితే... దానికి లక్షలు లేదా కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.

  ఈ రూపాయి నోటును కేంద్ర ప్రభుత్వం 26 ఏళ్ల కిందటే ముద్రించడం ఆపేసింది. ఐతే... 2015లో మళ్లీ రూపాయి నోట్ల ముద్రణ ప్రారంభమైంది. కొత్త నోట్లు కొత్త కలర్‌తో మార్కెట్‌లోకి వచ్చాయి. ఐతే... స్వాతంత్ర్యానికి పూర్వపు రూపాయి నోటు మీ దగ్గర ఉంటే... మీరు రూ.7 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మీ దగ్గర అలాంటి పురాతన నోట్లు ఉంటే... వాటిని మీరు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో వేలానికి పెట్టి... లక్షలు సంపాదించవచ్చు.

  స్వాతంత్ర్యానికి పూర్వం 1935లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గవర్నర్ జే డబ్ల్యూ కెల్లీ సంతకంతో... కొద్దిపాటి రూపాయి నోట్లను ముద్రించింది. ఆ నోట్లకు ఇప్పుడు ఈబే (eBay)లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే... మీరు వాటిని లక్షలకు అమ్ముకోవచ్చు.

  ఈబేలో మాత్రమే కాదు... ఇంకా చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. అవి https://indiancoinmill.com ఇందులో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు. అలాగే... https://www.collectorbazar.com/indian-notes/ ఈ వెబ్‌సైట్లో పాత నోట్లు నాణేలతోపాటూ... పాత స్టాంపులను కూడా అమ్ముకోవచ్చు. కొనుక్కోవచ్చు. Coinbazzar.com వెబ్‌సైట్‌ కూడా ఇలాంటిదే. అక్కడ కూడా అమ్మవచ్చు, కొనవచ్చు.

  అందరికీ తెలిసిన అమెజాన్ (https://www.amazon.in/s?k=old+notes&i=toys&ref=nb_sb_noss) ఈ-కామర్స్ సైట్‌లో కూడా అమ్ముకోవచ్చు. ఇందుకు కొన్ని కండీషన్లను ఒప్పుకోవాల్సి ఉంటుంది.

  ఇది కూడా చదవండి: Viral pics: చనిపోయిన వారి దంతాలు, వెంట్రుక‌ల‌తో నగలు.. ఆస్ట్రేలియా మహిళ ప్రతిభ

  ఎలా అమ్ముకోవాలి?:

  మీ దగ్గర పాత నోటు ఉంటే... మీరు ఏ వెబ్‌సైట్‌లో అమ్మదలచుకున్నారో... ఆ సైట్‌లో ముందుగా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయ్యి... మీరు అమ్మదలచుకున్న నోటును రెండువైపులా ఫొటో తీసి... అప్‌లోడ్ చెయ్యాలి. దాని ప్రత్యేకత ఏంటో చెప్పాలి. ఎంతకు అమ్మదలచుకున్నారో రేట్ ఫిక్స్ చెయ్యాలి. అలాగే మీ మొబైల్ నంబర్, పేరు ఇవ్వాలి. ఎవరైనా ఆ నోట్ కొనదలిస్తే... మీకు కాల్ చేస్తారు. ఆ తర్వాత ధర మాట్లాడుకొని... అమ్ముకోవచ్చు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Earn money, Earning old coins

  ఉత్తమ కథలు