• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • EARN 5000 RUPEES MONEY BY SHARE YOUR VACCINATION PICTURE WITH AN INTERESTING TAGLINE DETAILS HERE SU

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా..? ఇంట్లో ఉండే రూ. 5 వేలు సొంతం చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రజల్లో వ్యాక్సిన్‌పై చైతన్యం తీసుకొచ్చే విధంగా ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

  • Share this:
    దేశంలోని కరోనా వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన పౌరులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ వేయించుకుని ఇంట్లోనే ఉండి రూ. 5వేలు గెలుచుకునే అవకాశన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని My Gov India అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు వెల్లడించింది. రూ. 5వేలు గెలుచుకోవాలంటే.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న సమయంలో తీసుకున్న ఫొటోను ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో షేర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రూ. 5 వేలు గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఇక, కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలవాలని పేర్కొంది.

    వ్యాక్సిన్ తీసుకునే సమయంలో దిగిన ఫొటోను షేర్ చేయడం కోసం https://bit.ly/3sFLakx లింక్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుందని My Gov India ట్విట్టర్‌లో వెల్లడించింది. అక్కడ Login to Participate ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫొటో అప్‌లోడ్ చేయడంతో పాటు, ట్యాగ్‌లైన్ షేర్ చేయాల్సి ఉంటుంది.





    బహుమతి ఎలా లభిస్తుందంటే..
    వ్యాక్సిన్ తీసుకున్నవారు షేర్ చేసిన ట్యాగ్‌లైన్స్‌లో నుంచి ప్రతి నెల 10 మందని ఎంపిక చేసి.. వారికి ప్రభుత్వం నుంచి రూ. 5 వేలు అందజేస్తారు. ఈ బహుమతి గెలుచుకోవాలంటే మీరు షేర్ చేసే ట్యాగ్‌లైన్ ప్రజలను చైతన్యపరిచే విధంగా, ఆసక్తికరంగా ఉండాల్సి ఉంటుంది.
    Published by:Sumanth Kanukula
    First published: