మీరు ఈ-సిగరెట్లు తాగుతూ... అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని భావిస్తూ ఉంటే... ఈ మేటర్ మీకోసమే. వేపర్స్గా పిలిచే ఈ-సిగరెట్ల వల్ల గుండెజబ్బులు, హార్ట్ ఎటాక్, గుండె నాళాలకు సంబంధించిన రోగాలు వస్తున్నాయి. అమెరికా హార్ట్ అసోసియేషన్ (AHA) జరిపిన పరిశోధనలో వేపర్స్ పీల్చేవారిలో 60 శాతం మందికి హార్ట్ ఎటాక్స్ వస్తున్నట్లు తేలింది. రెండు ఈ-సిగరెట్ల స్మోకింగ్... ఒక సంప్రదాయ సిగరెట్ స్మోకింగ్కి సమానమైన నష్టాలు తెస్తోందని తెలిసింది. ఎక్కువగా యూత్... ఈ-సిగరెట్లను వాడుతూ... గుప్పుగుప్పున పొగ వదులుతూ... అదో ఫ్యాషన్‌లా భావిస్తున్నారు. ఈ స్మోకింగ్ వల్ల కార్డియో వస్క్యురర్ డిసీజ్ వస్తోందని కెంటకీ న్యూరోసైన్స్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ ల్యారీ గోల్డ్ స్టెయిన్ తెలిపారు.

పొగతాగితే ఆరోగ్యానికి హానికరం
స్మోకింగ్ ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదా... ఐతే... వేపర్స్ వాడండి. ఇవి స్మోకింగ్ అలవాటును దూరం చేస్తాయి అని వేపర్స్ తయారీదార్లు చెబుతున్నా, వాస్తవంలో అలా జరగట్లేదనీ, స్మోకింగ్ అలవాటు మానుకోలేకపోతున్నారని పరిశోధనలో తేలింది.

పొగతాగితే ఆరోగ్యానికి హానికరం
మొత్తం 4,00,000 మందిని పరిశోధించగా... వారిలో 66,795 మంది వేపర్స్ వాడుతున్నారు. వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 71 శాతం ఉన్నట్లు తేలింది అలాగే 59 శాతం మందికి హార్ట్ ఎటాక్ లేదా యాంజినా వచ్చే ప్రమాదం ఉందని తేలింది. యాంజినా అనేది రొమ్ముపై వచ్చే ఒకరకమైన నొప్పి. గుండెకు రక్తం సరిగా సరఫరా కానప్పుడు ఈ నొప్పి వస్తుంది. పరిశోధనలో మరో విషయం కూడా తెలిసింది. వేపర్స్ పీల్చే వారిలో... 40శాతం మందికి గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తెలిసింది. ఐతే మరణం సంభవిస్తుందా అన్నది మాత్రం పరిశోధించలేదు.

పొగతాగితే ఆరోగ్యానికి హానికరం
స్మోకింగ్ చేసేవాళ్లలో 4.2 శాతం మంది పెద్దవాళ్లు ఈ-సిగరెట్లు వాడుతుండగా... హైస్కూల్ విద్యార్థులు ఏకంగా 11.3 శాతం ఉన్నారని తేలింది. ఇలాంటి వాటికి యూత్ ఎట్రాక్ట్ అవ్వకుండా ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. స్వీట్ ఫ్లేవర్లతో వచ్చే ఈ-లిక్విడ్స్‌ను నిషేధించాలి. ఈ సిగరెట్ల వల్ల లాభం సంగతేమోగానీ... అవి మనకు సేఫ్ కాదన్నది మాత్రం నిజమని పరిశోధనలు చెబుతున్నాయి.
Video: పంట పొలాలపై ఏనుగు దాడి... రైతుల ఆవేదన...
Published by:Krishna Kumar N
First published:February 08, 2019, 09:06 IST