బైక్ ఉంటే చాలు.. ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేయడం.. తమ ప్రాణాలనే పోగొట్టుకోవడం..లేక ఇతరుల ప్రాణాలను తీయ్యడం పోకిరిగాళ్ల అలవాటు.. పోలీసులు, తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఏదో ఒక అనర్థం తీసుకోచ్చేవరకు వీళ్లు మారరు.. అత్యుత్సాహంతో సైలెన్సర్లు తీసేసి వెళ్లడం, ర్యాష్ డ్రైవింగ్, రోడ్లపై గట్టిగా అరవడం.. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్.. ఇవన్ని చాలదనట్లు కొంతమంది ఓవరాక్షన్ మరింత పీక్స్‌కు వెళ్లుతుంది. రోడ్డుపై అడ్డదిడ్డమైన స్టంట్స్ వేయడం.. ఇతర వాహనదారులను భయపెట్టడం చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత వార్నింగ్ ఇచ్చినా.. కేసులు పెట్టినా వీళ్ల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా బెంగళూరు(Bengaluru)లో బైక్(bike)పై ఓ యువకుడు చేసిన అతి సీసీటీవీలో రికార్డయింది. దీనిపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకింతా షో?:
బెంగళూరు పట్టణంలో పోకిరిల ర్యాష్ డ్రైవింగ్(Rash driving) వాహనదారులతో పాటు నడుచుకుంటూ వెళుతున్న వారిని హడలెత్తిస్తోంది. పోకిరిలు అతివేగంతో డ్రైవ్ చేస్తుండటంతో పాటు సైలెన్సర్‌ను రేస్ చేస్తు వేగంగా వెళుతున్నారు. దీంతో ఫ్యామిలీతో బైకుపై ప్రయాణిస్తున్న వారు, నడుచుకుంటూ వెళుతున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పోకిరిల ర్యాష్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు జరిగే అవకాశలు ఉన్నాయని వాహనాదురులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతో డ్రైవింగ్ చేస్తున్న వారిపై ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించిన బెంగళూరు పోలీసులు కొన్ని రోజులుగా వీరిపై స్పెషల్ ఫోకస్ పెంచారు.. నగరంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు అతి డ్రైవింగ్ వాళ్లకి కనపడింది. "Dumb way to die" అనే క్యాప్షన్‌తో ఆ వీడియోను ట్వీట్ చేశారు.
If you do survive, you know we'll be waiting for you ???????? pic.twitter.com/SPh1Wt1VZb
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) March 2, 2023
చచ్చిపోవాలంటే ఇలా డ్రైవ్ చేయండి:
బెంగళూరు పోలీసులు పోస్ట్ చేసిన వీడియో సోషలమీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో యువకుడు అడ్డమైన స్టంట్స్ చేసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫ్రంట్ టైర్ లేపి ముందుకువెళ్తున్నాడు. అంతేకాదు.. టైర్ లేపడంతో పాటు బైక్‌ను అటు ఇటు తిప్పుతూ సర్కస్ ఫీట్‌లు చేస్తున్నాడు. ఒక కాలు(leg)ను సీట్‌పై పెట్టి వీపరీత స్టంట్స్ చేశాడు. దీనిపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఈ స్టంట్స్ చేసిన తర్వాత బతికే ఉంటే మేము వస్తున్నాం నీ దగ్గరకు రెడీగా ఉండు అంటూ క్యాప్షన్ పెట్టారు. దీనిపై నెటిజన్లు వివిద రకాల కామెంట్లు చేస్తున్నారు. యలచెనహళ్లి మెట్రో స్టేషన్ దగ్గర ఇది సర్వసాధారణమని.. అది వారి ఇష్టానుసారం జరుగుతుందని కామెంట్లు పెడుతున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Bike rides, Police