యువరాజు అంటే మామూలుగా ఉండదు. ఆయన బయటకు వస్తున్నాడంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. రాజుకు అడుగడుగునా జనం నీరాజనాలు పడతారు. పూలబాట వేస్తారు. ఇప్పుడు రాజ్యాలు, గుర్రాలు లేవు. కానీ గల్ఫ్ సహా పలు దేశాల్లో యువరాజులు ఉన్నారు. గుర్రాల స్థానంలో అత్యాధునిక కార్లు ఉన్నాయి. మరి యువరాజులు బయటకు వస్తే ఆ సందడి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. కానీ దుబాయ్ యువరాజు సైకిల్‌తో రోడ్డు మీదకు వచ్చారు. సాధారణ వ్యక్తిలా రోడ్డుపై సైకిల్ తొక్కుతూ దూసుకెళ్లారు. అంతేకాదు ఓ నిప్పు కోడితో పోటీ పడుతూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనవరి 1న ఉదయం దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ సైక్లింగ్ చేశాడు. కొందరితో కలిసి రోడ్డుపై సైకిల్ నడిపించాడు. అందరూ కలిసి రయ్ మంటూ దుబాయ్ రోడ్లపై దూసుకెళ్లారు. ఐతే అదే సమయంలో రోడ్డు పక్కన నుంచి నిప్పుకోళ్లు (ఉష్ట్రపక్షి) మధ్యలో ప్రవేశించాయి. ఓ ఉష్ట్రపక్షి రోడ్డుకు సమాంతరంగా పరుగులు పెట్టడంతో.. దానితో పోటీపడుతూ సైకిల్ తొక్కారు షేక్ హమ్దాన్. అది వెళ్లిపోయిన తర్వాత మరో నిప్పుకోడి కూడా పరుగులు తీసింది. దానితోనూ పోటీపడి మరీ సైకిల్ నడిపించారు దుబాయ్ యువరాజు.
పార్క్‌లో 10 అడుగుల పామును పట్టిన బుడ్డోడు.. పేరెంట్స్ షాక్..
ఆ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలా క్యూట్‌గా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ మంచి ఎక్స్‌పీరియెన్స్ అని కామెంట్ చేశారు. కొత్త ఏడాదిని దుబాయ్ రాజు అద్భుతంగా ప్రారంభించారు అని ఇంకొందరు ఇన్‌స్ట్రామ్‌లో పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:January 04, 2021, 16:46 IST