హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video: ఓ పావురం కోసం బెంజ్ కార్ పక్కన పెట్టిన దుబాయ్ ప్రిన్స్..

Video: ఓ పావురం కోసం బెంజ్ కార్ పక్కన పెట్టిన దుబాయ్ ప్రిన్స్..

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ బెంజ్ కారు మీద గూడు పెట్టిన పావురం

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ బెంజ్ కారు మీద గూడు పెట్టిన పావురం

ఓ పావురం గూడు పెట్టుకుంటే దాని కోసం తన కాస్ట్‌లీ కారును పక్కన పెట్టారు.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌం తీసుకున్న ఓ చర్య నెటిజన్ల అభినందలను అందుకుంటోంది. ఆయన గ్యారేజ్‌లోని ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారు అద్దాలు తుడిచే వైపర్ దగ్గర ఓ పావురం గూడు పెట్టుకుంది. కొన్ని రోజుల పాటు ఆ కారును తీయకపోవడంతో ఆ పావురం అక్కడ గూడు పెట్టింది. అలాగే గుడ్లు కూడా పెట్టింది. దీన్ని చూసిన షేక్ హందాన్‌కు ఆ కారు తీయడానికి మనసొప్పలేదు. ఆ గూడు పెట్టి, గుడ్డు పెట్టిన పక్షి పిల్ల వచ్చే వరకు అలానే వదిలేశాడు. ఆ కారుకి ఎండ తగలకుండా పైన టార్పాలిన్ కట్టారు. అలాగే, కారుకి నాలుగు వైపులా ఎవరూ దగ్గరకు వెళ్లకుండా తాళ్లు కూడా కట్టారు. దీని వల్ల పాపం ఆ పావురానికి డిస్టర్బెన్స్ ఉండదని భావించారు. ఆ పావురం గూడు, దాని బుజ్జి కూన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.









View this post on Instagram






A post shared by Fazza (@faz3) on



ఈ వీడియో చూడా చాలా క్లారిటీగా ఉంది. అత్యాధునిక కెమెరాలను వినియోగించి ఈ వీడియోను తీసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి క్రౌన్ ప్రిన్స్ చేసిన పనికి నెటిజన్లు అభినందిస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Dubai

ఉత్తమ కథలు