Home /News /trending /

DRUNKEN MAN TRAVELLS GAYA TO DHANBAD BY SLEEPING ON GOODS TARIN ROOF PVN

Viral : ఫుల్ గా మందుకొట్టి రైలు బోగీపై పడుకున్నాడు..220 కి.మీ అలాగే ప్రయాణించిన తర్వాత చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drunken man on goods tarin roof: బీహార్(Bihar) లో ఓ యువకుడు ఫుల్ గా మద్యం సేవించి..మద్యం మత్తులో గూడ్స్ రైలు(Goods Train) బోగీ పైన ఎక్కాడు. అయితే రైలు కదులుతున్న సోయ కూడా లేకుండా అలాగే బోగీపైన పడుకొని 220 కిలోమీటర్లు ప్రయాణించాడు.

ఇంకా చదవండి ...
Drunken man on goods tarin roof: బీహార్(Bihar) లో ఓ యువకుడు ఫుల్ గా మద్యం సేవించి..మద్యం మత్తులో గూడ్స్ రైలు(Goods Train) బోగీ పైన ఎక్కాడు. అయితే రైలు కదులుతున్న సోయ కూడా లేకుండా అలాగే బోగీపైన పడుకొని 220 కిలోమీటర్లు ప్రయాణించాడు. గయాలోని మాన్​పుర్ లో రైలు బోగీపైన పడుకున్న అతడిని..రైలు జార్ఖండ్​(Jharkhand)లోని ధన్​బాద్​కు చేరుకున్న సమయంలో స్టేషన్​లోని ప్రయాణికులు, సిబ్బంది గుర్తించి కిందకు దించారు. యువకుడిని తునకుప్ప ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం ఉన్నప్పటికీ యువకుడు క్షేమంగానే బయటపడ్డాడు. దిగేటప్పుడు విద్యుత్ తీగలకు తగిలితే పెద్ద ప్రమాదం జరిగేదని స్టేషన్​లో ఉన్న ఆందోళన చెందారు. అయితే యువకుడిని ధన్​బాద్​ స్టేషన్ లో సిబ్బంది కిందకు దించుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, రెండు రోజుల క్రితం బీహార్​లో ఓ వ్యక్తి రైలు ఇంజిన్ చక్రాలపై కూర్చొని 190 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. మంచినీళ్లు కావాలని యువకుడు ఏడ్చేసరికి లోకోపైలట్ అతడిని గుర్తించాడు. పట్నా మీదుగా రాజ్​గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్​ప్రెస్​లో ఈ ఘటన జరిగింది. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ద పూర్ణిమ ఎక్స్ ప్రెస్ ట్రైన్ జర్నీలో ఉండగా.. ఇంజన్ వద్ద కూర్చున్న డ్రైవర్ కి ఎవరూ ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపించింది. గయా జంక్షన్​లో రైలు ఆగిన తర్వాత ఇంజిన్ కింది భాగాన్ని ఓసారి పరిశీలించాడు డ్రైవర్. ఎవరో ఓ వ్యక్తి మంచినీళ్లు కావాలని అరుస్తున్నట్లు డ్రైవర్ గుర్తించాడు.

మందుబాబులకు గుడ్ న్యూస్..కొత్త పాలసీ..60 శాతం తగ్గనున్న మద్యం ధరలు

రూ.50వేలు కడితేనే కొడుకు మృతదేహాన్ని ఇస్తామన్న హాస్పిటల్.. భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులు!



టార్చ్​లైట్ వేసి చూడగా ఇంజిన్​ కింది భాగంలో కూర్చొని ఉన్న వ్యక్తిని చూశాడు. కొందరు ప్రయాణికుల సాయం తీసుకొని యువకుడిని బయటకు తీశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి అక్కడ నుంచి పరార్ అయ్యాడు. యువకుడి వివరాలేవీ తెలియలేదు. ఈ విషయంపై డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ యువకుడికి మతిస్థిమితంగా లేదని అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై పెద్దగా వివరాలు చెప్పలేదు. రాజ్​గిర్​లో యువకుడు రైలు ఎక్కి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. యువకుడు క్షేమంగా ఇక్కడికి చేరడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Drinkers, Viral

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు