• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DRUNKEN MAN FIGHTING WITH SNAKE VIDEO GOES VIRAL FROM RAJASTHAN BA 2

Viral Video: ఫుల్లుగా మందు కొట్టి.. పాముతో పరాచకాలు.. కాటేస్తే...

Viral Video: ఫుల్లుగా మందు కొట్టి.. పాముతో పరాచకాలు.. కాటేస్తే...

పాముతో పరాచకాలు ఆడుతున్న యువకుడు

ప్రకాష్ ఫుల్లుగా మందు కొట్టి ఉండడం వల్ల అతడికి కనీసం పాముతో ఆడుతున్నానన్న స్పృహకూడా లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు అతడిని పాము మూడుసార్లు కాటేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

  • Share this:
    ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో పరాచకాలు ఆడాడు. ఏదో చిన్న పిల్లలతో ఆడుకుంటున్నట్టుగా పాముతో ఆడుకున్నాడు. రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఓ వ్యక్తి పాముతో ఆడుకుంటున్నాడు’ అంటూ గ్రామంలో ప్రచారం జరగడంతో ఊరంతా పనులు మానేసి పరిగెత్తుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్‌కి గురయ్యారు. ఓ వ్యక్తి అతడికి ఎదురుగా పాము వారి కళ్లకు కనిపించాయి. అయితే, ఆ పాముతో వ్యక్తి ఆటలాడుతున్న దృశ్యాన్ని చూసి వారి ఒళ్లు గొగుర్పొడిచింది. పాముని కొద్దిసేపు మెడలో వేసుకుని, అటూ ఇటూ తిప్పుతూ దాన్నో బొమ్మలా ఆడుకుంటున్నాడు.

    పాముతో సయ్యాటలు ఆడుతున్న వ్యక్తిని ప్రకాష్ మహావర్‌గా గుర్తించారు. అయితే, ప్రకాష్ ఫుల్లుగా మందు కొట్టి ఉండడం వల్ల అతడికి కనీసం పాముతో ఆడుతున్నానన్న స్పృహకూడా లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు. మరోవైపు అతడిని పాము మూడుసార్లు కాటేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అదే సమయంలో ఓ వ్యక్తి పాము కాట్లతో ఆస్పత్రిలో చేరినట్టు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరూ ఒకరేనా? లేకపోతే వేర్వేరు వ్యక్తులా అనేది తెలియాల్సి ఉంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు