తాగి రోడ్లపై తూగుతూ..ఊగుతూ కనిపించే వాళ్లను చూశాం. మందు ఎక్కువై రోడ్లపై పడిపోయిన వాళ్లు చాలా మంది ఉంటారు. కాని మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఏకంగా రోడ్డుపైనే మద్యం దుకాణం పెట్టాడో వ్యక్తి. రద్దీగా ఉండే రోడ్డు(Road)పైన దర్జాగా ఓ కుర్చీ వేసుకొని ..చేతిలో గ్లాస్ పట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న మందు బాటిల్లోంచి కొంత మందు గ్లాస్లో పోసుకున్నాడు. అటుపై అందులో నీళ్లు కలుపుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఠీవీగా కాలు మీద కాలేసుకొని మద్యం తాగాడు. కొత్వాలి(Kotwali)ప్రాంతంలో జరిగిన ఈ వార్తకు సంబంధించిన వీడియో(Video)నే ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది.
రోడ్డు మీదే మందు దుకాణం ..
ఓ మందు బాబు న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. ఇంట్లోనో లేక కాలనీలోనో చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కాని ఆ తాగుబోతు ఏకంగా మద్యం దుకాణాన్ని రోడ్డుపైనే పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దౌలత్‌గంజ్ మార్కెట్లో జరిగింది. ఓ వ్యక్తి హ్యాపీగా నడిరోడ్డుపై కుర్చి వేసుకొని చేతిలో గ్లాస్ మరో చేతిలో మద్యం బాటిల్ పట్టుకున్నాడు. వెంటనే గ్లాసులో మద్యం పెగ్గులు పోసుకున్నాడు. అక్కడి మరో వ్యక్తి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇవ్వడంతో మద్యంలో వాటర్ మిక్స్ చేసుకొని తాగేశాడు.
సిగ్గు సిగ్గు ..
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఓ మందుబాబు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే నడిరోడ్డుపై మద్యం తాగుతుంటే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఒక్కరూ అతడ్ని కదిలించలేకపోగా ..కనీసం మందలించిన పాపాన పోలేదు. వరుసగా రెండు పెగ్గులు వేసుకున్న మందుబాబు గంటల తరబడి రోడ్డుపై కూర్చున్నాడు. మత్తు తలకెక్కడంతో నడిరోడ్డుపై అదే కూర్చిలో ఒరిగిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు.
న్యూసెన్స్ వీడియో ..
వాహనదారులకు, స్థానికులకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫుట్‌పాత్‌పై మద్యం తాగిన వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. అతడ్ని అక్కడి నుంచి పక్కకు జరపడానికి పడరాని పాట్లు పడ్డారు. అక్కడి నుంచి వెళ్లనని తెగేసి చెప్పిన మందుబాబు రచ్చ చేశాడు. రోడ్డుపై ఉన్న వాళ్లంతా ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Viral Video