హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

షాకింగ్.. క్లాసులో తాగిన ఉపాధ్యాయుడు.. మత్తులో ఏంచేశాడంటే.. వైరల్ వీడియో..

షాకింగ్.. క్లాసులో తాగిన ఉపాధ్యాయుడు.. మత్తులో ఏంచేశాడంటే.. వైరల్ వీడియో..

క్లాసులో మందుబాటిళ్లతో ఉపాధ్యాయుడు

క్లాసులో మందుబాటిళ్లతో ఉపాధ్యాయుడు

Uttar Pradesh: తరగతిలో విద్యార్థులు కిందకూర్చుని పాఠలు వింటున్నారు. ఇంతలో వారి ఉపాధ్యాయుడు మద్యం బాటిళ్లను తీసుకుని వచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

పిల్లలకు ఉపాధ్యాయులు సరైన విద్యాబుద్ధులు నేర్పిస్తారని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే స్కూల్ లకు పంపించి, తమ పిల్లాడిని సమాజంలో ఒక ఉన్నత స్థానంలో, సరైన మార్గంలో ఉండేలా తీర్చిదిద్దమంటూ ఉపాధ్యాయులను కోరుకుంటారు. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం పవిత్రమైన తమవృత్తికే మచ్చను తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాగా పాఠశాలకు రావడం చేస్తున్నారు. అదే విధంగా.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా.. విద్యార్థినులతో కూడా నీచంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్లాసులోనే విద్యార్థులతో సపర్యలు చేయించుకొవడం, తాగి క్లాసుకు రావడం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh)  హత్రాస్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తాగి స్కూల్ కు వచ్చాడు. ఆ తర్వాత.. తనతో పాటు బాటిళ్లను కూడా క్లాసులోకి తీసుకెళ్లాడు. అతని ముందు చిన్నపిల్లలు క్లాసులో కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిని గమనించి నిలదీశాడు. దీంతో ఉపాధ్యాయుడు మందుబాటిళ్లను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ వాగ్వాదం జరిగింది.

ఈ వీడియో తీసి సదరు వ్యక్తి సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video) మారింది. దీంతో దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Drinking wine, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు