Viral Video: అయ్య బాబోయ్.. మద్యం మత్తులో ఎక్కడికి చేరాడో తెలుసా..?

(Image Credit-Youtube/Buzz Watch)

మద్యం మత్తులో ఉన్నవారు ఏం చేస్తారనేది వారికే తెలియదు. ఫుల్‌గా మద్యం తాగి కొందరు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సందర్భాలు  చాలానే ఉన్నాయి.

  • Share this:
    మద్యం మత్తులో ఉన్నవారు ఏం చేస్తారనేది వారికే తెలియదు. ఫుల్‌గా మద్యం తాగి కొందరు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సందర్భాలు  చాలానే ఉన్నాయి. తాజాగా ఫుల్‌గా మద్యం తాగిన ఓ వ్యక్తి విమానాశ్రయంలో చేసిన విన్యాసాలు చూస్తే నవ్వకుండా ఉండలేరు. ఎయిర్‌పోర్ట్ రన్‌వే మీదకు వెళ్లాల్సిన వ్యక్తి దారి తప్పి.. కన్వేయర్ బెల్ట్‌పైకి చేరాడు. ఇంకేముంది.. అక్కడ ఏం జరుగుతుందో తెలియక, తాను ఎటు వెళ్తున్నాడో అర్థం కాక అవస్థలు పడ్డాడు. ఈ ఘటన జూలై 28 రష్యా మాస్కోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

    వివరాలు.. జూలై 28న ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్ రన్ వే పైకి వెళ్లేందుకు చూశాడు. అయితే పూర్తిగా మద్యం మత్తులో ఉండటం వల్ల దారితప్పాడు. చివరకు ఎయిర్‌పోర్ట్‌లోని కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ సరిగా నడవలేని స్థితిలో ఉన్న అతడు.. కన్వేయర్ బెల్ట్‌పై పడిపోయాడు. అయితే అదే సమయంలో అతని బ్యాగ్ అక్కడ ఉన్న హ్యాండ్ రైల్‌కు చిక్కుపోయింది. అక్కడే పడిపోయిన అతడి షూ ఉడిపోయింది. అయితే అతను మాత్రం గట్టిగా ప్రయత్నించి బ్యాగ్ దక్కించుకుంటాడు. ఆ తర్వాత షూ కోసం వెతకడం ప్రారంభించాడు.



    అయితే అలా కన్వేయర్ బెల్ట్‌పై ప్రయాణం చేసి చివరకు బ్యాగేజ్ స్క్రీనింగ్ గేట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ సెక్యూరిటీ గార్డులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: