Viral Video : తనతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో ఓ వ్యక్తిని చెప్పుతో చావగొట్టింది ఓ మహిళ. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ(Dharwad)లో ఈ ఘటన జరిగింది. మహిళతో పాటు అక్కడే ఉన్న కొందరు యువకులు కూడా అతడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా(Viral Video) మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళను మెచ్చుకుంటున్నారు. మీ ధైర్యానికి హ్యాట్సాప్ అంటూ ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి నీచులను అస్సలు వదలకూడదు.. తగిన బుద్ది చెప్పారు అంటూ ఆమెకు మద్దుతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగింది
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలోని శుభాష్ రోడ్డులో ఫుల్ గా మద్యం సేవించిన ఓ వ్యక్తి దారినపోతున్న మహిళల ఫోన్ నెంబర్లను అడుగుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అయితే చాలామంది వీడితో మనకెందుకులే అని తమ దారిన తాము వెళ్లిపోయారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి ఆమె ఫోన్ నంబర్ అడిగాడు మందుబాబు. అంతేకాకుండా ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. . దీంతో ఆగ్రహించిన సదరు మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. మరోసారి మహిళ జోలికి పోవాలంటే భయపడేలా చావగొట్టింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం మహిళకు సపోర్ట్‌గా నిలిచారు. వారు కూడా ఆ మందుబాబుని తాగింది దిగిందాకా కొట్టారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.
A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL
— Imran Khan (@KeypadGuerilla) December 30, 2022
Viral Video: వీడెవడండీ బాబు..సింహంతో ఆడుకుంటున్నాడు..వీడియో వైరల్
మరోవైపు,విమానంలో(Flight) ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. క్యాబిన్ క్రూ సేఫ్టీ నిబంధనలు గురించి చెబుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఈ నెల 26న బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు థాయి స్మైల్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. అయితే విమానాం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో ఇద్దరి ప్రయాణికుల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. వారి మాటలు కొద్ది సమయం తర్వాత గొడవకు దారితీసింది. ఇలా ఇద్దరు మాటకు మాట పెంచుకుంటూ వాదులాడుకుంటున్నారు. ఇద్దర్నీ విమాన సిబ్బంది వారించే ప్రయత్నం చేశారు. అయినా వారి మధ్య గొడవ ఆగలేదు. ఇంతలో ఓ వ్యక్తి తన కళ్లజోడును తీసి ఎదురుగా ఉన్న నల్ల చొక్కా ధరించిన వ్యక్తిని కొట్టడం,అతడికి మద్దతుగా వచ్చిన స్నేహితులు కూడా ఆ ప్రయాణికుడిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఐదుగురు వ్యక్తులు దాడి చేయడంతో అతడు వారి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ప్లీజ్ ఆపండి అని క్యాబిన్ సిబ్బంది అరుస్తున్నా పట్టించుకోకుండా ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దులు కురిపించడం కనిపిస్తుంది. ఆ దెబ్బలను అడ్డుకుంటూ, తాను కూడా కొట్టడానికి నల్ల చొక్కా ధరంచిన వ్యక్తి ప్రయత్నించడం కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Viral Video